oath program
-
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం.. 14న
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మంగళవారం ముగియనుంది. వీరి స్థానంలో కొత్తగా ఎన్నికైన 12 మంది ఈ నెల 14న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న వారితో పాటు కొత్తగా ఎన్నికైన అందరూ టీఆర్ఎస్కు చెందిన వారే. కాల పరిమితి పూర్తి చేసుకుంటున్న సభ్యుల్లో ఏడుగురు మళ్లీ స్థానిక సంస్థల కోటాలోనే మండలికి ఎన్నికయ్యారు. గతేడాది జూన్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో వి.భూపాల్‌రెడ్డిని ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం భూపాల్‌రెడ్డి పదవీ కాలం పూర్తికావడం, మండలికి కొత్త చైర్మన్ ఎన్నిక జరగకపోవడంతో మళ్లీ ప్రొటెమ్ చైర్మన్‌ను నియమించే అవకాశముంది. మండలిలో సీనియర్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ను ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో జరిగే వార్షిక బడ్జెట్ సమావేశాల్లో మండలికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశముంది. శాసన మండలికి కొత్తగా ఐదుగురు.. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో పోచంç పల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), నారదాసు లక్ష్మణ్రా వు, టి.భానుప్రసాద్‌రావు (కరీంనగర్), పురా ణం సతీష్ (ఆదిలాబాద్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), వి.భూపాల్‌రెడ్డి (మెదక్), పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), తేరా చిన్నపరెడ్డి (నల్ల గొండ), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసి రెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్) ఉన్నారు. వీరిలో ఏడుగురు గత నెలలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో మళ్లీ మండలికి ఎన్నికయ్యారు. తిరిగి మండలికి ఎన్నికైన వారిలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నా రు. ఎల్.రమణ (కరీంనగర్), దండె విఠల్ (ఆదిలాబాద్), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్), తాతా మధుసూదన్‌రావు (ఖమ్మం), మంకెన చినకోటిరెడ్డి (నల్ల గొండ) తొలిసారి అడుగు పెట్టనున్నారు. -
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ
Live Updates Time: 04:15 Pm ► మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మాది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ► రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతామని, వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ►కేబినెట్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎస్ఈసీగా మహిళను నియమించామన్నారు. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. Time: 03:05 Pm ► హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను చేశామని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు చాలా వేగంగా నమోదు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని కొంత మంది అవహేళన చేస్తూ చట్టానికి సంబంధించిన కాపీలను తగల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Time: 02:30 Pm ► మహిళా సాధికారతపై ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. Time: 02:15 PM ► ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. Time: 01: 55 PM ► మహిళా సాధికారతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. Time: 01:15 PM ► అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు. Time: 12:57 PM ► మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. Time: 12:40 Pm ► వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. Time: 12: 30 PM ► రుణమాఫీ పథకం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్ఆర్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు. Time: 12:24 PM ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. Time: 10:20 AM ► ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు. Time: 10: 10 AM ► ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. Time: 09:50 AM ► అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు హాజరు కాగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. Time: 09: 09 AM ► ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ► ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. -
ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీల నేపథ్యం: ► లేళ్ల అప్పిరెడ్డి: గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి వైస్ జగన్ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► మోషేన్‌రాజు: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ► తోట త్రిమూర్తులు: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ► రమేష్‌యాదవ్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ రికార్డ్: ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ -
సీజేఐగా నేడు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎన్వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్ఎన్వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు. మూడేళ్లపాటు ఉండాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్లపాటు ఉండాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీజేఐ పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ విచారకరమేనన్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణల ద్వారా సుప్రీంకోర్టులో సుమారు 50వేల కేసులు విచారణ ముగించడం గొప్ప అచీవ్‌మెంట్‌గా కేకే వేణుగోపాల్ అభివర్ణించారు. సంతృప్తిగా ఉంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. శుక్రవారం కోర్టు హాలులో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో చాలా క్లుప్తంగా మాట్లాడారు. బాధ్యతలను జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగిస్తున్నానని, సమర్థంగా కోర్టును నడిపిస్తారన్న విశ్వాసం ఉందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. క్రమశిక్షణతోనే కరోనాను జయించగలం:జస్టిస్ ఎన్వీ రమణ కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని మరికొద్ది గంటల్లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరం ఉంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టకాలం బలమైన వారిని సృష్టిస్తుందని, సుప్రీంకోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో కూడా కరోనా బాధితులున్నారని తెలిపారు. -
సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం
మెల్బోర్న్: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు. శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్
సాక్షి, బెంగళూరు: గత నెల 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు మంగళవారం కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు పర్వం తరువాత కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును సాగనంపి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కడం తెలిసిందే. అనేక కసరత్తుల అనంతరం 17 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం మంగళవారం ఏర్పాటయింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయివాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి, నేటి మంత్రి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరశైవ–లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ పదవులు దక్కాయి. 2008లో కర్ణాటక సీఎంగా పనిచేసిన జగదీశ్ శెట్టర్ ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక కేబినెట్లో ఉన్నారు. మరో 16 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 17 జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. -
రేపే పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అభిమాన నేత పట్టాభిషేకం కోసం జిల్లా దారులన్నీ విజయవాడ వైపే దారి తీస్తున్నాయి. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. ఆ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ఆయనను సీఎంగా చూడాలని గత ఎనిమిదేళ్లుగా అహర్నిశలూ కష్టపడిన పార్టీ కార్యకర్తలు.. ఆ సమయం రావడంతో విజయవాడకు భారీగా పయనమవుతున్నారు. ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడాలని ఆత్రుత కనబరుస్తున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వల్ప తేడాతో ఓడినా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో.. 2014 ఎన్నికల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా సీఎం అవుతారని అందరూ భావించారు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఎంతో ఆశించారు. కానీ, ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అధికారాన్ని దూరమైంది. వైఎస్ జగన్ గ్యారంటీగా సీఎం అవుతారని భావించిన పార్టీ శ్రేణులకు అప్పట్లో నిరాశ ఎదురైంది. అయితే, కార్యకర్తలు కుంగిపోకుండా.. ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో నాటి నుంచి తాజా ఎన్నికల వరకూ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడ్డారు. చెప్పాలంటే అలుపెరగని పోరాటం చేశారు. పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా వెరవకుండా ముందుకు సాగారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ టిక్కెట్టుపై గెలిచిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని ప్రలోభాలతో టీడీపీలోకి తీసుకున్నారు. తద్వారా వైఎస్సార్ సీపీని బలహీనపరచేందుకు ఎంతో ప్రయత్నించారు. అయినప్పటికీ కార్యకర్తల్లో సంకల్పం సడలలేదు. వేధింపులకు ఎదురొడ్డి.. గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను, అభిమానులను టీడీపీ నాయకులు ఎన్నో వేధింపులకు గురి చేశారు. అక్రమ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలేవీ అందకుండా చేశారు. దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా అవమానపరిచారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపించారు. ప్రత్యేక రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు. కనీసం టీడీపీ కార్యకర్తకు ఇచ్చిన గౌరవాన్ని కూడా ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఇవ్వలేదు. ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారులు సహితం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను చిన్నచూపు చూశారు. నానా అవమానాలకు గురవుతున్నా.. వీటన్నింటికీ ఎదురొడ్డి మరీ వైఎస్సార్ సీపీ నాయకులు ముందుకు సాగారు. వేధింపులు, కేసులు, ఇతర ఇబ్బందులే కాకుండా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఆదాయ వనరులను కూడా ‘పచ్చ’ పాలకులు దెబ్బ తీశారు. వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు పెట్టారు. కక్ష సాధింపు చర్యలు చేపట్టి నష్టపరిచే కార్యక్రమాలు చేపట్టారు. అన్ని రకాలుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులను హింసించారు. మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ లేకుండా చేయాలని, తమకు ఎదురే లేకుండా ఉండాలని అన్ని రకాల కుయుక్తులు, కుట్రలు ప్రదర్శించారు. కానీ మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలు, నాయకులు ఎదురొడ్డి నిలిచారు. పీడిత ప్రజలకు అండగా.. 2014లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా తప్పనిసరిగా వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని అహోరాత్రాలూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్యనే ఉన్నారు. వారి కష్టాల్లో అండగా నిలిచారు. వారి సమస్యలపై పోరాడారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచారు. గత ఐదేళ్లుగా జగన్మోహన్రెడ్డి పడిన కష్టాన్ని ప్రజలు కళ్లారా చూశారు. నాయకులు పడిన అవస్థలను దగ్గరుండి చూశారు. ఈసారి ఎలాగైనా వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కంకణబద్ధులయ్యారు. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు కూడా ఒకవిధమైన కసితో కష్టపడి, సమన్వయంతో పని చేశాయి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రజలు అందించారు. ఫలితంగా అత్యధిక ఓట్లు కట్టబెట్టి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లోనూ, మూడు పార్లమెంటరీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను జిల్లా ప్రజలు గెలిపించారు. ఇదే ట్రెండ్ రాష్ట్రవ్యాప్తంగా కనిపించడంతో ప్రజాకంటక పాలన సాగించిన టీడీపీ పునాదులు కదిలిపోయాయి. ప్రజాభీష్టం మేరకు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని జనప్రియ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిష్టించబోతున్నారు. ఆ కీలక, చారిత్రక సందర్భాన్ని దగ్గరుండి చూడాలని మన జిల్లా ప్రజలు ఆరాటపడుతున్నారు. విజయవాడలో జరిగే వైఎస్ జగన్ పట్టాభిషేకాన్ని చూసేందుకు పయనమవుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచీ వందలాదిగా తరలి వెళ్తున్నారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని మరీ బయలుదేరుతున్నారు. ఇప్పటికే కొంతమంది విజయవాడ వెళ్లగా, మరికొంతమంది పయనమవుతున్నారు. -
పటిష్ట బందోబస్తు.. ట్రాఫిక్ మళ్లింపు
గుంటూరు: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ పార్టీల నేతలు భారీసంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వాహనాల పార్కింగ్ స్థలాలు, జాతీయ రహదారిపై వచ్చే వాహనాల దారి మళ్లింపు తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ సీహెచ్ విజయరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు వివరాలు తెలిపారు. అదనపు బలగాల మోహరింపు జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ఎ.నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూడా అదనపు బలగాలను మోహరించడంతోపాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలన్నింటినీ దారి మళ్లించడం, పార్కింగ్ స్థలాలకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వీవీఐపీలు, వీఐపీల భద్రతలో భాగంగా చర్యలు చేపట్టారు. నిఘా వర్గాల సూచనల మేరకు బందోబస్తును పటిష్టంగా నిర్వహించడంతోపాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. నేటి అర్ధరాత్రి నుంచే.. బుధవారం అర్ధరాత్రి నుంచి చెన్నై నుంచి విజయవాడ వెపునకు వెళ్లే భారీ వాహనాలను వారధి సమీపంలోని బైపాస్ లేబై లలో నిలిపివేయనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో నిలిపేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ పరిధిలోని శ్రీనాథ్ ఇన్ఫ్రా వద్ద భారీ వాహనాలను నిలిపేలా చర్యలు చేపట్టారు. చెన్నై వైపు నుంచి జాతీయ రహదారిపై విజయవాడకు వచ్చే వాహనాలు నిలుపుకునేందుకు ఇష్టపడని వాహనాలకు అనుమతి ఇచ్చి గుంటూరు రూరల్ మండలం బుడంపాడు వైపుగా తెనాలి, రేపల్లె వైపు నుంచి కృష్ణా జిల్లాలోకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. చుట్టుగుంట మీదుగా హైదరాబాద్‌కు.. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనచోదకులు గుంటూరులోని చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపుగా హైదరాబాద్ వెళ్లేలా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ఒక వేళ అలా వెళ్లడం ఇష్టం లేని వారు ట్రాఫిక్ ఆంక్షలు ముగిసేవరకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వేచి ఉండేందుకు అనుమతిస్తారు. నార్త్, సౌత్ ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు, సాయుధ దళ సిబ్బంది, ఏరియా డామినేషన్ టీమ్‌లు, బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్లు, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం పార్కింగ్ స్థలాల్లో, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలలో ప్రయాణికులకు, వాహనచోదకులకు ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు కలుగకుండా ఉండేలా చేయడంతోపాటు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యాన్ని అందించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. హైవేపై గస్తీ వాహనాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పకటిప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూంకు చేరవేసేలా సిద్ధంచేశామని ఎస్పీ వివరించారు. -
మిజోరం కొత్త సీఎం ప్రమాణం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు. తాన్లూ్యయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు. -
14న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం!
ఇస్లామాబాద్: పాక్ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్ట్ 14న ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణం చేసే వీలుందని పాక్ మీడియా తెలిపింది. గతంలో తాను ఆగస్టు 11నే పాక్ ప్రధానిగా ప్రమాణం చేస్తానని ఇమ్రాన్ ప్రకటించారు. జూలై 25న జరిగిన పోలింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. కొత్త పాక్ ప్రధాని ఆగస్టు 14న ప్రమాణస్వీకారం చేయాలన్నది తన, ఆపద్ధర్మప్రధాని నసీరుల్ ముల్క్ ఉద్దేశమని తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్ చెప్పారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని వెల్లడించారు. -
ప్రమాణానికి మోదీని ఆహ్వానించొచ్చా?
ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వర్గాలు పాక్ విదేశాంగ శాఖను కోరినట్లు ఓ స్థానిక చానెల్ బుధవారం కథనాన్ని ప్రసారం చేసింది. మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై పీటీఐ సీనియర్ నేతలు పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్జువాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్, సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించాలని ఇమ్రాన్ యోచిస్తున్నట్లు ఛానెల్ తెలిపింది. ఇమ్రాన్ ప్రమాణస్వీకార ఆహ్వానాన్ని మోదీ తిరస్కరిస్తే అంతర్జాతీయంగా పాక్ తలెత్తుకోలేదని విదేశాంగ అధికారులు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లకు ఆహ్వానాలు పంపినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌధురి తెలిపారు. కాగా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మంత్రుల నివాస సముదాయంలోని మరో ఇంట్లో దిగేందుకు ఇమ్రాన్ అంగీకరించారు. ఇప్పుడున్న ఇంట్లో ఇమ్రాన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించలేమని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రధాని నివాసాన్ని తాను ఉపయోగించబోనని గతంలో ఇమ్రాన్ చెప్పారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా
జెడ్పీసెంటర్: ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్మన్ బండారిభాస్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో తన కు కేటాయించిన అధికార నివాసాన్ని బు ధవారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా అవసరమైన మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించా రు. తనను కలిసేందుకు వచ్చే వారికి ఎ లాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, మంచినీటి వసతికి ఇబ్బంది లేకుం డా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేడు బాధ్యతలు స్వీకరణ..? జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు బాధ్యలు చేపట్టలేదని సమాచారం. గురువారం జిల్లా పరిషత్‌లో జరిగే మన ఊరు-మన ప్రాణాళిక కార్యక్రమానికి టీఆర్ఎస్ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నారుు. కాగా ఇప్పటికే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జెడ్పీ చైర్మన్ ఇప్పటివరకు అధికారింగా బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం. అభివృద్ధిలో పాలుపంచుకుందాం మహబూబ్‌నగర్ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకోవడంతోనే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటేనే పోరాటం ఫలించినట్లవుతుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్ మండలంలోని జమిస్తాపూర్, కోడూరు, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొట్టమొదట కోడూరు గ్రామంలో రూ.4.25కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో నిర్మించే బీటీరోడ్డుకు జెడ్పీచైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీచైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వానికి చేయూతనిచ్చే విధంగా అందరు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు. అన్నిశాఖల ఉద్యోగులు వారివారి స్థాయిలో అభివృద్ధికోసం వంతుగా కృషిచేయాలని కోరారు. ఐదేళ్లప్రణాళికను రూపొందించి..అధికారులు, ప్రజాప్రతిధులు కలిసి పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీదేవి, ఎంపీపీ సావిత్రి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగయ్య, బాలమణి, హన్మానాయక్, రామకిష్టమ్మతో పాటు ఎంపీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆలస్యంగా వస్తానని ముండే అనుమతి అడిగారు..
న్యూఢిల్లీ: అంత సవ్యంగా జరిగితే బుధవారం పార్లమెంట్ లో గోపినాథ్ ముండే ప్రమాణ స్వీకారం జరిగాల్సి ఉండేది. కాని విధి వక్రీకరించి.. మరోలా జరిగింది. పార్లమెంట్ లో జరిగే లోకసభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా వస్తానని అనుమతి తీసుకున్నారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. నియోజకవర్గ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున్న కాస్తా ఆలస్యం అవుతుందని తనతో అన్నారని వెంకయ్య మీడియాకు వెల్లడించారు. నా అనుమతి కోరారు. నేను ఓకే అన్నాను. కాని ఆయన ఇప్పడు మనతో లేరు.. అని వెంకయ్య ఉద్వేగానికి లోనయ్యారు. గతరాత్రి తనతో మాట్లాడిన ముండే.. మంగళవారం ఉదయమే ప్రమాదంలో కన్నుమూయడం వెంకయ్యను దిగ్భాంతికి గురి చేసింది. -
'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఆపార్టీ నేత కర్నె ప్రభాకర్ సూచించారు. జూన్ 1 తేది అర్ధరాత్రి 12గం.లకు ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని.. జూన్1, 2 తేధీల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని కర్నె ప్రభాకర్ తెలిపారు. జూన్ 2న తెలంగాణలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాతోపాటు, టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు.