
మెల్‌బోర్న్: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్‌లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు. శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్‌లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment