gourav sharma
-
సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం
మెల్బోర్న్: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు. శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
న్యూజిలాండ్ ఎంపీ నోట సంస్కృతం మాట
ఆక్లాండ్: ప్రవాస భారతీయుడు డాక్టర్ గౌరవ్ శర్మ మరోసారి ప్రపంచం మొత్తం మన భారతదేశం గురించి మాట్లాడుకునేలా చేశారు. న్యూజిలాండ్‌లో గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గౌరవ్ శర్మ.. తాజాగా ఆ దేశ పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. ఆయన సంస్కృతం భాషలో ప్రమాణస్వీకారం చేశారు. మొట్టమొదటిగా న్యూజిలాండ్ అధికారిక భాష మోరీలో ఆయన ప్రమాణం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఈ సందర్భంగా ఓ నెటిజన్ గౌరవ్‌ను ట్విటర్లో అడిగారు. ముందుగా తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నానని.. సంస్కృతం అన్ని భాషలకు మూలం కాబట్టి దానిని ఎంచుకున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల క్రితం భారత్ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ గౌరవ్ అధికార లేబర్ పార్టీ నుంచి పోటీచేసి ప్రత్యర్థి టిమ్ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో విజయం సాధించారు. గౌరవ్ విజయానికి ముఖ్య కారణం ఆయన సామాజిక దృక్పథం. కరోనా సమయంలో ఆయన విశేష సేవలందించారు. 2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచి ప్రజల దృష్టిలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు, ఇంత చిన్న వయసులో ఎంపీగా బాధ్యతలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. To be honest I did think of that, but then there was the question of doing it in Pahari (my first language) or Punjabi. Hard to keep everyone happy. Sanskrit made sense as it pays homage to all the Indian languages (including the many I can’t speak) https://t.co/q1A3eb27z3 — Dr Gaurav Sharma MP (@gmsharmanz) November 25, 2020 -
టైటాన్స్‌ను గెలిపించిన గౌరవ్
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాట్స్ ఆటగాడు గౌరవ్ శర్మ (49 పరుగులు, 6/36, 5/30 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో టైటాన్స్ 150 పరుగుల తేడాతో క్లాసిక్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రోజు టైటాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు, క్లాసిక్ 64 పరుగులు చేసి ఆలౌటయ్యాయి. మంగళవారం 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన టైటాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (35) కలుపుకొని ప్రత్యర్థి ముందు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్లాసిక్... గౌరవ్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 136, చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 318/5 డిక్లేర్డ్, ఆక్స్ఫర్డ్ రెండో ఇన్నింగ్స్: 139/4 (రమేశ్ నాయక్ 66, శామ్యూల్ 34). డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 87, ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 112, డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 60 (హబీబ్ 38; అద్నాన్ 6/29), ఎలిగెంట్ రెండో ఇన్నింగ్స్: 36/3. రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 188, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 147/9 డిక్లేర్డ్ (జగదీశ్ రెడ్డి 5/33), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 76/7 (కార్తీక్ 3/29).