టైటాన్స్‌ను గెలిపించిన గౌరవ్ | gourav sharma leads hyderabad titans | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌ను గెలిపించిన గౌరవ్

Published Wed, Jul 27 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

gourav sharma leads hyderabad titans

 ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాట్స్ ఆటగాడు గౌరవ్ శర్మ (49 పరుగులు, 6/36, 5/30 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో టైటాన్స్ 150 పరుగుల తేడాతో క్లాసిక్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రోజు టైటాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు, క్లాసిక్ 64 పరుగులు చేసి ఆలౌటయ్యాయి.

మంగళవారం 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన టైటాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (35) కలుపుకొని ప్రత్యర్థి ముందు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్లాసిక్... గౌరవ్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగుల వద్ద ఆలౌటైంది.
 
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 అక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 136, చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 318/5 డిక్లేర్డ్, ఆక్స్‌ఫర్డ్ రెండో ఇన్నింగ్స్: 139/4 (రమేశ్ నాయక్ 66, శామ్యూల్ 34).
డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 87, ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 112, డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 60 (హబీబ్ 38; అద్నాన్ 6/29),
ఎలిగెంట్ రెండో ఇన్నింగ్స్: 36/3. రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 188, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 147/9 డిక్లేర్డ్ (జగదీశ్ రెడ్డి 5/33), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 76/7 (కార్తీక్ 3/29).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement