హైదరాబాద్‌ వాండరర్స్‌ గెలుపు | Hyderabad Wanderers beat Shalimar by 8 Wickets | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వాండరర్స్‌ గెలుపు

Published Mon, Nov 19 2018 10:24 AM | Last Updated on Mon, Nov 19 2018 10:24 AM

Hyderabad Wanderers beat Shalimar by 8 Wickets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–3 డివిజన్‌ వన్డే లీగ్‌లో హైదరాబాద్‌ వాండరర్స్‌ జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో షాలిమార్‌ సీసీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన షాలిమార్‌ సీసీని బౌలర్లు జితేందర్‌ (4/32), వెంకట్‌ (3/21) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి షాలిమార్‌ 39.1 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్‌ (51) అర్ధసెంచరీ సాధించగా, అమిత్‌ (46) రాణించాడు. అనంతరం హైదరాబాద్‌ వాండరర్స్‌ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తుమ్మల్‌ (108 నాటౌట్‌) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తుకారాం (34) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్షిత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
 రుషిరాజ్‌: 267/5 (మలిక్‌ 65, సాద్విక్‌ రెడ్డి 84; అవినాశ్‌ 2/45, అభినవ్‌ 2/52), యూత్‌ సీసీ: 147 (కేశవ్‌ 38; నితాయ్‌ 4/28, రషీద్‌ 3/32).  

 రాయల్‌ సీసీ: 189/9 (రామానుజ 60, అఫ్జల్‌ 46; సాయి కార్తికేయ 3/39, శరత్‌ 3/42, ఇమ్రోజ్‌ 2/13), గ్రీన్‌లాండ్స్‌: 190/5 (సాయి కార్తికేయ 73, ముదస్సిర్‌ 48).

 సూపర్‌స్టార్‌ సీసీ: 186 (ఆర్యన్‌ 57;  రవి కుమార్‌ 5/42, విక్రాంత్‌ 2/23), సఫిల్‌గూడ సీసీ: 160 (వంశీ 41; విమల్‌ 3/45, రహీమ్‌ 3/25).  
 యంగ్‌ సిటిజన్స్‌: 174/8 (చరణ్‌ దీప్‌ 36; అబ్దుల్లా 2/12, రోహిత్‌ 2/29, ఒమర్‌     2/8), సౌథెండ్‌ రేమాండ్స్‌: 177/3   (కౌశిక్‌ 66, దావూద్‌ 53; మహేశ్‌ 1/30,  అభిరామ్‌ 1/34).  

 న్యూస్టార్స్‌: 102 (సాజిద్‌ 23; నేహాంత్‌ 5/27, అంకిత్‌ 2/24), ధ్రువ్‌ ఎలెవన్‌:105/3  (ఆశ్లేష్‌ 50). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement