సాక్షి, హైదరాబాద్: ఓపెనర్లు డానీ డారిక్ ప్రిన్స్ (111 బంతుల్లో 103 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), తిరుమలశెట్టి సుమన్ (98), చెలరేగడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘డ్రా’ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఎస్‌బీఐ జట్టుకు 3 పాయింట్లు దక్కగా... ఇన్‌కంట్యాక్స్ జట్టుకు 1 పాయింట్ లభించింది.
ఓవర్‌నైట్ స్కోరు 279/5తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టు మరో 41 పరుగులు జతచేసి తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో రవి కిరణ్ 5, ఆకాశ్ భండారి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎస్‌బీఐ గురువారం ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది.
ప్రిన్స్, సుమన్‌లు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సుమన్ ఔటయ్యాక వచ్చిన కేఎస్‌కే చైతన్య (51 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
రాణించిన రవీందర్, నిఖిల్...
ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బాట్లింగ్ బ్యాట్స్‌మెన్ రవీందర్ (306 బంతుల్లో 219; 35 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు నిఖిల్ రామ్ రెడ్డి (88; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 606 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మారుతి, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌట్ కాగా... రవీందర్, నిఖిల్‌లతో పాటు సయ్యద్ చాంద్ పాషా (83) రాణించడంతో హైదరాబాద్ బాట్లింగ్ భారీ స్కోరు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
ఈఎమ్‌సీసీ తొలి ఇన్నింగ్స్: 267, స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 214 (విఘ్నేశ్ అగర్వాల్ 3/26, మికిలి జైస్వాల్ 3/51), ఈఎమ్‌సీసీ రెండో ఇన్నింగ్స్: 180/7 (మికిలి జైస్వాల్ 57; ఆంజనేయులు 3/40). పాయింట్లు: ఈఎమ్‌సీసీ–3, స్పోర్టింగ్ ఎలెవన్–1.
ఎవర్‌గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172, ఎవర్‌గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 208 (బి. మనోజ్ కుమార్ 80; సయ్యద్ మెహదీ హసన్ 4/31), ఎన్స్‌కాన్స్ 181 (రౌల్ రోహాన్ 32, ఒవైస్ 33; నవీన్ 4/21, బుద్ది రాహుల్ 3/49), పాయింట్లు: ఎవర్‌గ్రీన్–6, ఎన్స్‌కాన్స్–0.
ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 403/9 (ఠాకూర్ తిలక్ వర్మ 203 నాటౌట్, ఎన్. అనిరుధ్ 35; గిరీశ్ గౌడ్ 3/72, ఆకాశ్ 3/32), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 176/3 (మేహుల్ భౌమిక్ 51, వైష్ణవ్ రెడ్డి 100 నాటౌట్), పాయింట్లు: జెమిని ఫ్రెండ్స్ 3, ఎంపీ కోల్ట్స్–1.
డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73, డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 191 (టి. రవితేజ 3/57, కనిష్క్ నాయుడు 3/26), ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 191/4 (ఆశిష్ రెడ్డి 98 నాటౌట్, అమోల్ షిండే 37 నాటౌట్), పాయింట్లు: డెక్కన్ క్రానికల్–3, ఆంధ్రాబ్యాంక్–1.
ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 309/9, బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 227 (షేక్ ఖమ్రుద్దీన్ 5/39), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్: 214/7 (కపిల్ 32, విశ్వంత్ 47, జగదీశ్ 40, ఎస్‌కేఎమ్ బాషా 31 నాటౌట్, సధన్ 3/68), పాయింట్లు: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ–3, బీడీఎల్–1.
దయానంద్ సీసీ: 371, జై హనుమాన్: 357/8 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 116 నాటౌట్, కె. సాయి పూర్ణానంద్ రావు 50, ప్రయాస్ సింగ్ 36; షేక్ సలీమ్ 4/67), పాయింట్లు: జై హనుమాన్–3, దయానంద్ సీసీ–1.
Comments
Please login to add a commentAdd a comment