Hyderabad Titans
-
రోహిత్ సాగర్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్ బ్యాట్స్‌మన్ రోహిత్ సాగర్ (183 బంతుల్లో 104; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. దీంతో క్లాసిక్ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టైటాన్స్ భారీస్కోరు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో 43 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రోహిత్ సెంచరీ చేయగా, సయ్యద్ రాహుల్ (46), యశ్గుప్తా (38) రాణించారు. అనంతరం క్లాసిక్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 4 వికెట్లకు 26 పరుగులతో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు నేషనల్ సీసీ: 122 (అశ్విన్ విజయ్ 35; హర్షవర్దన్ 5/22), తెలంగాణ: 47/1 (20 ఓవర్లలో). డబ్ల్యూఎంసీసీ: 239 (శాశ్వత్ 61; అఖిల్ 5/47), ఫ్యూచర్ స్టార్: 140/1 (నితీశ్ 52 బ్యాటింగ్, హర్ష్ వర్దన్ 67 బ్యాటింగ్). జిందా తిలిస్మాత్: 176 (కలీమ్ 60; రమేశ్ 5/72, సుమీత్ జోషి 5/30), గెలాక్సీ సీసీ: 50/5. మెగా సిటీ: 163 (దీపక్ దీక్షిత్ 3/37, అనిరుధ్ 6/45), సికింద్రాబాద్ నవాబ్స్: 102 (గౌరవ్ రెడ్డి 50, ప్రవీణ్ రెడ్డి 48). బాలాజీ సీసీ: 277 (సిద్ధార్థ్ 90; నరేశ్‌కుమార్ 4/19), డెక్కన్ వాండరర్స్: 15/3 (6 ఓవర్లలో). సీసీఓబీ: 141 (అబ్దుల్ అజీమ్ వర్షి 80; రిషబ్ 6/38), కొసరాజు: 145/9 (అబ్దుల్ అజీమ్ వర్షి 3/33). టీమ్ స్పీడ్: 223/4 (ప్రజ్వల్ 45, సాగర్ చౌరాసియా 86), వీనస్ సైబర్టెక్తో మ్యాచ్. అవర్స్ సీసీ: 111 (అభిషేక్ రెడ్డి 43; శ్రీకరణ్ 3/29, విఘ్నేశ్ 6/53), క్రౌన్ సీసీ: 112/5 (విఘ్నేశ్ 51 నాటౌట్). -
టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా
► ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం 42/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 131 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మోహన్ కుమార్ (35) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. టైటాన్స్ బౌలర్లలో గౌరవ్ కుమార్, రుత్విక్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ టైటాన్స్ మ్యాచ్ ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌లో టైటాన్స్ 188 పరుగులు చేసింది. మరో మ్యాచ్ స్కోర్లు పాషా బీడి తొలి ఇన్నింగ్స్: 372/7 డిక్లేర్డ్, ఎలిగెంట్ సీసీ తొలిఇన్నింగ్స్: 110/8 (ప్రవీత్ కుమార్ 7/56). ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు తిరుమల: 62 (సంజయ్ ప్రధాన్ 3/24, సాయి కార్తీక్ 3/8), మణికుమార్ సీసీ: 64/2 (సునీల్ 31). అక్షిత్ సీసీ: 96 (విష్ణు 31; అబ్దుల్ యూసుఫ్ 5/21), షాలీమార్ సీసీ: 97/4 (దివేశ్ డైమా 35). గోల్కొండ సీసీ: 136/6 (వరుణ్ 48), రిలయన్స్: 52/4. -
టైటాన్స్‌ను గెలిపించిన గౌరవ్
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాట్స్ ఆటగాడు గౌరవ్ శర్మ (49 పరుగులు, 6/36, 5/30 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో టైటాన్స్ 150 పరుగుల తేడాతో క్లాసిక్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రోజు టైటాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు, క్లాసిక్ 64 పరుగులు చేసి ఆలౌటయ్యాయి. మంగళవారం 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన టైటాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (35) కలుపుకొని ప్రత్యర్థి ముందు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్లాసిక్... గౌరవ్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 136, చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 318/5 డిక్లేర్డ్, ఆక్స్ఫర్డ్ రెండో ఇన్నింగ్స్: 139/4 (రమేశ్ నాయక్ 66, శామ్యూల్ 34). డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 87, ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 112, డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 60 (హబీబ్ 38; అద్నాన్ 6/29), ఎలిగెంట్ రెండో ఇన్నింగ్స్: 36/3. రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 188, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 147/9 డిక్లేర్డ్ (జగదీశ్ రెడ్డి 5/33), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 76/7 (కార్తీక్ 3/29). -
చెలరే గిన యోగీందర్
జింఖానా, న్యూస్‌లైన్: యోగీందర్ (95 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లో సుల్తాన్ షాహీ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన సుల్తాన్ షాహీ జట్టు 386 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో రెండో రోజు బ్యాటింగ్ చేసిన టైటాన్స్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. యోగీందర్ రెండు, ప్రశాంత్ 5 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో పాషా బీడీ జట్టుపై అవర్స్ సీసీ జట్టు నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాషా బీడీ జట్టు 104 పరుగుల వద్ద ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అవర్స్ సీసీ జట్టు 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి విజయం సాధించింది. బౌలర్ ముజ్తాబా 4 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. అలీ ఖాన్ (26 నాటౌట్), పుష్పీందర్ (29) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ కోల్ట్స్: 294, పీ అండ్ టీ కాలనీ: 144 (సాయి సంతోష్ 37 నాటౌట్, మహేష్ రెడ్డి 45 నాటౌట్, నవజ్యోత్ సింగ్ 5/38) జిందా సీసీ: 395, హెచ్‌బీసీసీ: 300/8 (రోహిత్ 33, అక్షయ్ 45, ఒమర్ 71, తౌసీఫ్ 68, శ్రవణ్ 3/62, ఫరాజ్ 3/94) ఎ-డి విజన్ వన్డే లీగ్ స్కోర్లు ఎస్యుసీసీ: 109 (సుధీర్ 4/24), యునెటైడ్ సీసీ: 78 (ఫిరోజ్ 3/10, హమీద్ 4/23).