రోహిత్ సాగర్‌ సెంచరీ | Rohit sagar slams century for hyderabad titans | Sakshi
Sakshi News home page

రోహిత్ సాగర్‌ సెంచరీ

Published Tue, Aug 22 2017 10:27 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM

Rohit sagar slams century for hyderabad titans

సాక్షి, హైదరాబాద్‌: ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ టైటాన్స్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ సాగర్‌ (183 బంతుల్లో 104; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. దీంతో క్లాసిక్‌ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ టైటాన్స్‌ భారీస్కోరు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించడంతో 43 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రోహిత్‌ సెంచరీ చేయగా, సయ్యద్‌ రాహుల్‌ (46), యశ్‌గుప్తా (38) రాణించారు. అనంతరం  క్లాసిక్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 4 వికెట్లకు 26 పరుగులతో నిలిచింది.

ఇతర మ్యాచ్‌ల వివరాలు


నేషనల్‌ సీసీ: 122 (అశ్విన్‌ విజయ్‌ 35; హర్షవర్దన్‌ 5/22), తెలంగాణ: 47/1 (20 ఓవర్లలో).
డబ్ల్యూఎంసీసీ: 239 (శాశ్వత్‌ 61; అఖిల్‌ 5/47), ఫ్యూచర్‌ స్టార్‌: 140/1 (నితీశ్‌ 52 బ్యాటింగ్, హర్ష్ వర్దన్‌ 67 బ్యాటింగ్‌).
జిందా తిలిస్మాత్‌: 176 (కలీమ్‌ 60; రమేశ్‌ 5/72, సుమీత్‌ జోషి 5/30), గెలాక్సీ సీసీ: 50/5.
మెగా సిటీ: 163 (దీపక్‌ దీక్షిత్‌ 3/37, అనిరుధ్‌ 6/45), సికింద్రాబాద్‌ నవాబ్స్‌: 102 (గౌరవ్‌ రెడ్డి 50, ప్రవీణ్‌ రెడ్డి 48).
బాలాజీ సీసీ: 277 (సిద్ధార్థ్‌ 90; నరేశ్‌కుమార్‌ 4/19), డెక్కన్‌ వాండరర్స్‌: 15/3 (6 ఓవర్లలో).
సీసీఓబీ: 141 (అబ్దుల్‌ అజీమ్‌ వర్షి 80; రిషబ్‌ 6/38), కొసరాజు: 145/9 (అబ్దుల్‌ అజీమ్‌ వర్షి 3/33).
టీమ్‌ స్పీడ్‌: 223/4 (ప్రజ్వల్‌ 45, సాగర్‌ చౌరాసియా 86), వీనస్‌ సైబర్‌టెక్‌తో మ్యాచ్‌.
అవర్స్‌ సీసీ: 111 (అభిషేక్‌ రెడ్డి 43; శ్రీకరణ్‌ 3/29, విఘ్నేశ్‌ 6/53), క్రౌన్‌ సీసీ: 112/5 (విఘ్నేశ్‌ 51 నాటౌట్‌).


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement