టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా | hyderabad titans and cheerful chams match drawn | Sakshi
Sakshi News home page

టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా

Published Sun, Jul 31 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా

టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా

ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 
 సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం 42/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 131 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మోహన్ కుమార్ (35) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

టైటాన్స్ బౌలర్లలో గౌరవ్ కుమార్, రుత్విక్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ టైటాన్స్ మ్యాచ్ ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌లో టైటాన్స్ 188 పరుగులు చేసింది.

మరో మ్యాచ్ స్కోర్లు
 పాషా బీడి తొలి ఇన్నింగ్స్: 372/7 డిక్లేర్డ్, ఎలిగెంట్ సీసీ తొలిఇన్నింగ్స్: 110/8 (ప్రవీత్ కుమార్ 7/56).
 ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు
తిరుమల: 62 (సంజయ్ ప్రధాన్ 3/24, సాయి కార్తీక్ 3/8), మణికుమార్ సీసీ: 64/2 (సునీల్ 31).  అక్షిత్ సీసీ: 96 (విష్ణు 31; అబ్దుల్ యూసుఫ్ 5/21), షాలీమార్ సీసీ: 97/4 (దివేశ్ డైమా 35).  గోల్కొండ సీసీ: 136/6 (వరుణ్ 48), రిలయన్స్: 52/4.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement