cricket league match
-
హైదరాబాద్ లో క్రికెట్ సందడి
-
క్రికెట్‌పై కన్నేసిన సత్యనాదెళ్ల, రూ.930కోట్లతో..!
అమెరికాలో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు త్వరలో తొలి ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు ఇండో-అమెరికన్ వ్యాపార వేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 100 కోట్లకు మందికి పైగా ప్రజలు క్రికెట్‌ను అభిమానిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రమే ఇది పాపులర్ అయ్యింది. అలాంటి జెంటిల్ గేమ్ క్రికెట్ మ్యాచ్‌లు ఇకపై అమెరికాలో జరగనున్నాయి. ఇందుకోసం సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్లుగా పలు దిగ్గజ కంపెనీలకు చెందిన యజమానులు, సీఈవోలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)ను ప్రారంభించారు. ఈ లీగ్ సంస్థలో సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడిగా ఉన్నారు. 📡 Investment secured to #BuildAmericanCricket 📡 MLC plans to deploy $120 million to launch world class T20 cricket league and transform cricket infrastructure in the USA 🏏🇺🇸 Read full press release ➡️ https://t.co/mTvWu6LQg1 pic.twitter.com/oJWbcTxpG1 — Major League Cricket (@MLCricket) May 18, 2022 120 మిలియన్ డాలర్ల ఫండ్ అమెరికాలో వరల్డ్ క్లాస్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ, అందుకు కావాల్సిన ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ కోసం నిర్వాహకులు ఏ అండ్ ఏ1 ఫండ్ రైజింగ్ పేరుతో నిధుల్ని సమీకరించారు. ఇప్పటివరకు 44మిలియన్ డాలర్లను సేకరించగా..మరో 12నెలల్లో 76మిలియన్ డాలర్లు సేకరించడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి.మొత్తంగా 120మిలియన్ (రూ.9,32,30,10,000) డాలర్లను ఫండ్‌ను సేకరించేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారు నిర్వాహకులు. చదవండి👉మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే! -
రారండోయ్... సత్తా చూపుదాం
క్రికెట్టే మీ జీవితమా... అయితే ఇక్కడ మీ జీవితమే మారిపోవచ్చు... ఆశల ఆకాశం... కలల ప్రపంచం... మీ నిలువెత్తు ప్రయత్నానికి మా అతి పెద్ద వేదిక... కేవలం మీరు చేయాల్సిందల్లా... ముందుగా ఎంట్రీలు పంపించడం.. ఆ తర్వాత బరిలోకి దిగడమే. తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జనవరి తొలి వారం నుంచి సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌సీపీఎల్) జరగనుంది. ఏ ఏ విభాగాల్లో... ►సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2001 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1995 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ►జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. ►సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కలి్పస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ►ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. జట్ల నమోదు ఇలా.... ►సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలనుకునే జట్లు దరఖాస్తుతోపాటు మూడు డాక్యుమెంట్లను జత చేయాలి. ►డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపు వేసి పంపించాలి. ►డాక్యుమెంట్–2: 15 మంది ఆటగాళ్ల ఫోటోలు, వారి వివరాలు, పదో తరగతి పరీక్ష హాల్ టికెట్ నంబర్ రాసి, ఫోటోలపై ప్రిన్సిపాల్ సంతకం చేయాలి. చివర్లో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ సంతకాలు, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ►డాక్యుమెంట్–3: (మ్యాచ్ జరిగే రోజు ఇవ్వాలి): ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన డిక్లరేషన్ దరఖాస్తు చివర్లో ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ►ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ధ్రువ పత్రాలు లేకుండా వచ్చిన ఎంట్రీలను పరిగణించరు. ముఖ్యమైన విషయం... ►మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. ►మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. ►గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 22వ తేదీలోగా పంపించాలి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. ►జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. (ఈ మూడు జిల్లాల మ్యాచ్‌లు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తారు) ►జోన్–2లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉన్నాయి. ►జోన్–3లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉన్నాయి. ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది. టోర్నీ ఫార్మాట్ ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోరీ్నకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 99120 35299, 96665 72244 (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్) 95055 14424, 96660 13544 (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్) -
సహేంద్ర మల్లు విజృంభణ
ఆక్స్ఫర్డ్ బ్లూస్, డబ్ల్యూఎంసీసీ మ్యాచ్ డ్రా ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ హైదరాబాద్: ఆక్స్ఫర్డ్ బ్లూస్ బౌలర్ సహేంద్ర మల్లు (6/78, 5/80) చెలరేగాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ డబ్ల్యూఎంసీసీ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆటలో డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్ లో 125 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆక్స్ఫర్డ్ జట్టు 9 వికెట్లు 274 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కృతిక్ రెడ్డి (93) రాణించగా, సహేంద్ర మల్లు (36) మెరుగ్గా ఆడాడు. దీంతో ఈ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు మంగళవారం ఆటలో డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. యశ్వంత్ 37, సమన్విత్ 39 పరుగులు చేశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ వాండరర్స్ తొలి ఇన్నింగ్స్: 154/9 డిక్లేర్డ్, గెలాక్సీ తొలి ఇన్నింగ్స్: 65, డెక్కన్ రెండో ఇన్నింగ్స్: 122/9 డిక్లేర్డ్ (ప్రత్యూష్ 52; దీపక్ 4/36), గెలాక్సీ రెండో ఇన్నింగ్స్: 212/8 ( రేవంత్ 74, యశ్ కపాడియా 38; ప్రత్యూష్ 4/36). హెచ్‌బీసీసీ తొలి ఇన్నింగ్స్: 283 (హృషికేశ్ సంజయ్ 63, ప్రిన్స ఓజా 69; అద్నాన్ 3/63), బడ్డింగ్ స్టార్స్ తొలి ఇన్నింగ్స్: 123/5 (జునైద్ అలీ 52; ఆదిత్య చౌదరి 3/32). రోహిత్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 357/6 డిక్లేర్డ్ (ఆరిఫ్ 150, శివకాంత్ 77), జిందా తిలిస్మాత్: 6/0 (వర్షంతో మ్యాచ్ జరగలేదు). కాన్‌కర్డ్ తొలి ఇన్నింగ్స్: 115/9 డిక్లేర్డ్, పాషా బీడి తొలి ఇన్నింగ్స్: 119/7 (ఫయాజ్ అహ్మద్ 41; ఆదిత్య అరోరా 3/16), ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 172/8 (అశ్విన్ విజయ్ 35; గౌరవ్ శర్మ 5/73) హైదరాబాద్ టైటాన్సతో మ్యాచ్ చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 351/8 డిక్లేర్డ్, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 173 (బాలరాజ్ 57; రవీందర్ 5/40, విఘ్నేశ్ 3/35), చీర్‌ఫుల్ రెండో ఇన్నింగ్స్: 112/4 (బాలు రెడ్డి 50). -
టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ మ్యాచ్ డ్రా
► ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్, చీర్‌ఫుల్ చమ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం 42/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 131 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మోహన్ కుమార్ (35) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. టైటాన్స్ బౌలర్లలో గౌరవ్ కుమార్, రుత్విక్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ టైటాన్స్ మ్యాచ్ ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌లో టైటాన్స్ 188 పరుగులు చేసింది. మరో మ్యాచ్ స్కోర్లు పాషా బీడి తొలి ఇన్నింగ్స్: 372/7 డిక్లేర్డ్, ఎలిగెంట్ సీసీ తొలిఇన్నింగ్స్: 110/8 (ప్రవీత్ కుమార్ 7/56). ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు తిరుమల: 62 (సంజయ్ ప్రధాన్ 3/24, సాయి కార్తీక్ 3/8), మణికుమార్ సీసీ: 64/2 (సునీల్ 31). అక్షిత్ సీసీ: 96 (విష్ణు 31; అబ్దుల్ యూసుఫ్ 5/21), షాలీమార్ సీసీ: 97/4 (దివేశ్ డైమా 35). గోల్కొండ సీసీ: 136/6 (వరుణ్ 48), రిలయన్స్: 52/4.