సహేంద్ర మల్లు విజృంభణ | sahendra mallu leading wicket taker | Sakshi
Sakshi News home page

సహేంద్ర మల్లు విజృంభణ

Published Wed, Aug 31 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

సహేంద్ర మల్లు విజృంభణ

సహేంద్ర మల్లు విజృంభణ

  •  ఆక్స్‌ఫర్డ్ బ్లూస్, డబ్ల్యూఎంసీసీ మ్యాచ్ డ్రా
  •  ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
  • హైదరాబాద్: ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బౌలర్ సహేంద్ర మల్లు (6/78, 5/80) చెలరేగాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ డబ్ల్యూఎంసీసీ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆటలో డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్ లో 125 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆక్స్‌ఫర్డ్ జట్టు 9 వికెట్లు 274 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

    కృతిక్ రెడ్డి (93) రాణించగా, సహేంద్ర మల్లు (36) మెరుగ్గా ఆడాడు. దీంతో ఈ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు మంగళవారం ఆటలో డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. యశ్వంత్ 37, సమన్విత్ 39 పరుగులు చేశారు.
     
    ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
     డెక్కన్ వాండరర్స్ తొలి ఇన్నింగ్స్: 154/9 డిక్లేర్డ్, గెలాక్సీ తొలి ఇన్నింగ్స్: 65, డెక్కన్ రెండో ఇన్నింగ్స్: 122/9 డిక్లేర్డ్ (ప్రత్యూష్ 52; దీపక్ 4/36), గెలాక్సీ రెండో ఇన్నింగ్స్: 212/8 ( రేవంత్ 74, యశ్ కపాడియా 38; ప్రత్యూష్ 4/36).
     

    హెచ్‌బీసీసీ తొలి ఇన్నింగ్స్: 283 (హృషికేశ్ సంజయ్ 63, ప్రిన్‌‌స ఓజా 69; అద్నాన్ 3/63), బడ్డింగ్ స్టార్స్ తొలి ఇన్నింగ్స్: 123/5 (జునైద్ అలీ 52; ఆదిత్య చౌదరి 3/32).
      రోహిత్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 357/6 డిక్లేర్డ్ (ఆరిఫ్ 150, శివకాంత్ 77), జిందా తిలిస్మాత్: 6/0 (వర్షంతో మ్యాచ్ జరగలేదు).
      కాన్‌కర్డ్ తొలి ఇన్నింగ్స్: 115/9 డిక్లేర్డ్, పాషా బీడి తొలి ఇన్నింగ్స్: 119/7 (ఫయాజ్ అహ్మద్ 41; ఆదిత్య అరోరా 3/16),
      ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 172/8 (అశ్విన్ విజయ్ 35; గౌరవ్ శర్మ 5/73) హైదరాబాద్ టైటాన్‌‌సతో మ్యాచ్
      చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 351/8 డిక్లేర్డ్, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 173 (బాలరాజ్ 57; రవీందర్ 5/40, విఘ్నేశ్ 3/35), చీర్‌ఫుల్ రెండో ఇన్నింగ్స్: 112/4 (బాలు రెడ్డి 50).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement