సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మంగళవారం ముగియనుంది. వీరి స్థానంలో కొత్తగా ఎన్నికైన 12 మంది ఈ నెల 14న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న వారితో పాటు కొత్తగా ఎన్నికైన అందరూ టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. కాల పరిమితి పూర్తి చేసుకుంటున్న సభ్యుల్లో ఏడుగురు మళ్లీ స్థానిక సంస్థల కోటాలోనే మండలికి ఎన్నికయ్యారు.
గతేడాది జూన్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో వి.భూపాల్‌రెడ్డిని ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం భూపాల్‌రెడ్డి పదవీ కాలం పూర్తికావడం, మండలికి కొత్త చైర్మన్ ఎన్నిక జరగకపోవడంతో మళ్లీ ప్రొటెమ్ చైర్మన్‌ను నియమించే అవకాశముంది. మండలిలో సీనియర్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ను ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో జరిగే వార్షిక బడ్జెట్ సమావేశాల్లో మండలికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశముంది.
శాసన మండలికి కొత్తగా ఐదుగురు..
పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో పోచంç పల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), నారదాసు లక్ష్మణ్‌రా వు, టి.భానుప్రసాద్‌రావు (కరీంనగర్), పురా ణం సతీష్ (ఆదిలాబాద్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), వి.భూపాల్‌రెడ్డి (మెదక్), పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), తేరా చిన్నపరెడ్డి (నల్ల గొండ), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసి రెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్) ఉన్నారు. వీరిలో ఏడుగురు గత నెలలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో మళ్లీ మండలికి ఎన్నికయ్యారు. తిరిగి మండలికి ఎన్నికైన వారిలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నా రు. ఎల్.రమణ (కరీంనగర్), దండె విఠల్ (ఆదిలాబాద్), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్), తాతా మధుసూదన్‌రావు (ఖమ్మం), మంకెన చినకోటిరెడ్డి (నల్ల గొండ) తొలిసారి అడుగు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment