'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు'
'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు'
Published Fri, May 30 2014 7:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఆపార్టీ నేత కర్నె ప్రభాకర్ సూచించారు. జూన్ 1 తేది అర్ధరాత్రి 12గం.లకు ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.
జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని.. జూన్1, 2 తేధీల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని కర్నె ప్రభాకర్ తెలిపారు. జూన్ 2న తెలంగాణలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాతోపాటు, టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు.
Advertisement
Advertisement