
కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతోంది..
నేతాజీ సుభాష్ చంద్రబోస్పై నిఘా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.
హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్పై నిఘా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్పై.. నెహ్రూ హయాంలో నిఘా పెట్టినట్లు ఓ లేఖ బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్య పైవిధంగా స్పందించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ముద్రా బ్యాంక్, ఇన్సూరెన్స్, జన్ధన్ యోజన పేద ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
ఎర్ర చందనం కూలీల ఎన్ కౌంటర్ విషయంలో విచారణ చేయాలనడం సబబే కానీ.. వికారుద్దీన్ ఎన్కౌంటర్పై మాట్లాడుతున్న ఎంఐఎం నేతలు పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సిమీ కార్యకర్తలను చంపితే మానవ హక్కులు గుర్తుకొస్తాయా అని అన్నారు.