కేసీఆర్‌తో వెంకయ్య దోస్తీ
తనంతట తానుగా వెళ్లి కలసిన కేంద్ర మంత్రి
ఇరు రాష్ట్రాల మధ్య అగాధం
నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మళ్లీ దోస్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. శనివారం ఆయన తనంతట తాను తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అంతకు ముందు చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అం శాలపై బాబు సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులందరూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుం డగా... వీటికి ప్రతిగా కేసీఆర్ వీలున్నప్పుడల్లా చంద్రబాబుపైన, వెంకయ్యపైన ధ్వజమెత్తుతున్నారు. వెంకయ్య కూడా కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టేవారు. ఇటీవలి కాలంలో కేసీఆర్‌పై వెంకయ్యనాయుడు వైఖ రిలో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయా లు, ఇతర అంశాలపై మాట్లాడనని చెబుతున్నారు. సమస్యలపై రెండు ప్రభుత్వాలూ కలసి కూర్చొని మాట్లాడుకోవాలన్నది తన ఆకాంక్షని అంటున్నారు.
సమస్యలను పరిష్కరించుకోవాలి : వెంకయ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సలహా ఇచ్చినట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంలను మర్యాదపూర్వకంగా కలసినప్పటికీ, ఈ సమావేశాలు అర్థవంతంగా సాగాయన్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన గ్యాప్ తొల గించడానికి తాను కేసీఆర్‌తో భేటీ అయ్యానన్న మీడి యా ప్రతినిధుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన వివాదంపై మాట్లాడబోనన్నారు. విభజన చట్టంలో పేర్కొ న్న అంశాల మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాలని, వివాదాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీకి నిధులివ్వాలని కోరిన బాబు
వెంకయ్యనాయుడుతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, మంజూరు చేయాల్సిన పనుల విషయంలో సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. విశాఖ, వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టులను సత్వరమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరానన్నారు.