
వాళ్లు మాకు గట్టి ప్రత్యర్థులే: ప్రియాంక
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమకు గట్టి ప్రత్యర్థేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తమకు ముఖ్యమైన ప్రత్యర్థి అయి తీరుతుందని ఆమె చెప్పారు. తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ కష్టాలను అధిగమిస్తుందన్న ధీమాను ప్రియాంక వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కష్టాలు ఎదుర్కొందని, అయినా వాటి నుంచి బయటపడిందని, ఇప్పుడు కూడా ఇలాగే కష్టాల నుంచి బయట పడటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.