Delhi Assembly Elections 2015
-
ఢిల్లీ ఎన్నికల్లో ఏబీపీ..వీఐపీ ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల గెలుపోటుములపై ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. చాందినీ చౌక్: అలక్ లాంబా గెలుపు అనుమానమే (ఆప్) పత్పండ్గంజ్: వినోద్ బిన్నీ ఓటమి ఖాయం (బీజేపీ) న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద నడకే (ఆప్) జనక్‌పురి: జగదీశ్‌ముఖి అనుమానమే (బీజేపీ) బల్లియమాన్: హయాన్ యూసుఫ్ ఓటమి (కాంగ్రెస్) కృష్ణానగర్: పరువు దక్కించుకోనున్న కిరణ్ బేడీ (బీజేపీ) పటేల్ నగర్: కృష్ణతీరథ్ ఓటమి (బీజేపీ) ద్వారకా: మహాబల్ మిశ్రా ఓటమి (కాంగ్రెస్) సదర్ బజార్: సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ కు ఎదురుదెబ్బ (కాంగ్రెస్) షీలంపూర్: మతిన్ అహ్మద్ ఓటమి (కాంగ్రెస్) జంగ్ పుర: ఎంఎస్ ధీర్ ఓటమి (బీజేపీ) తిమార్పూర్: రజనీ అబ్బీ ఓటమి (బీజేపీ) మంగోల్: రాఖిబిడ్ల గెలుపు (ఆప్) గ్రేటర్ కైలాశ్: సౌరభ్ భరద్వాజ్ గెలుపు ఖాయం (ఆప్) -
ఢిల్లీలో రెండు కేంద్రాల్లో రీ పోలింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ జరుగుతోంది. తూర్పు ఢిల్లీలోని రోహ్ తాస్ నగర్ లో బూతు నంబరు132, డీఐడీ లైన్స్ ఏరియాలోని నంబరు 31 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఉప ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవీఎం లు పని చేయకపోవటంతో ఆ రెండు కేంద్రాల్లో ఆరోజు పోలింగ్ జరగలేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. శనివారం జరిగిన పోలింగ్‌లో 67.14 శాతం పోలింగ్ నమోదైంది. -
వాళ్లు మాకు గట్టి ప్రత్యర్థులే: ప్రియాంక
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమకు గట్టి ప్రత్యర్థేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తమకు ముఖ్యమైన ప్రత్యర్థి అయి తీరుతుందని ఆమె చెప్పారు. తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలను అధిగమిస్తుందన్న ధీమాను ప్రియాంక వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కష్టాలు ఎదుర్కొందని, అయినా వాటి నుంచి బయటపడిందని, ఇప్పుడు కూడా ఇలాగే కష్టాల నుంచి బయట పడటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
ఓటింగ్ శాతంపైనే అందరి దృష్టి
-
ఢిల్లీ ఎన్నికలపై బిగ్ డిబేట్
దేశ రాజధాని నగరమైన హస్తినలో ఎన్నికలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఆసక్తే. అక్కడ కమలనాథులు పాగా వేస్తారా.. ఆప్ చీపురు దుమ్ము దులిపేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోడానికి అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. అందుకే 'సాక్షి టీవీ' ఈ ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్, నిపుణులతో చర్చా కార్యక్రమాలతో కూడిన 'బిగ్ డిబేట్'ను శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం చేయనుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు సంబంధించిన విశ్లేషణలు, ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉందనే అంచనాలు.. అన్నీ ఇందులో ఉంటాయి. -
కేజ్రీవాల్ అర్హతపై హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివసించే కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారంటూ ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు కిరణ్ వాలియా చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నోటీసు ఇచ్చింది. కేజ్రీవాల్, ఇతరులు దీనికి సమాధానం ఇవ్వాలంటూ కేసు విచారణను జస్టిస్ విభు బఖ్రు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన చిరునామాను తప్పుగా పేర్కొన్నారని, ఢిల్లీ ఓటరుగా ఉండేందుకే ఆయనిలా చేశారని ఆరోపిస్తూ న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. ఢిల్లీలోని బీకే దత్ కాలనీలో తాను శాశ్వత నివాసినంటూ ఎన్నికల కమిషన్‌కు కూడా కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆమె ఆరోపించారు. -
దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోదీ అటు కాంగ్రెస్ పార్టీ మీద, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని, ఆ రకంగా తనది అదృష్టం అయితే.. దురదృష్టవంతులను కోరుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలూ అబద్ధాలు వల్లిస్తూ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాళ్లు పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలా అనే ఆలోచిస్తారని, ఢిల్లీ ఎన్నికల్లో ఇంతకుముందు ఎప్పుడూ ఇంత ఘోరంగా అబద్ధాల మీద ఆధారపడిన సంఘటనలు లేవని మోదీ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండేసరికల్లా దేశంలోని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలనేదే తన ఆశయమని చెప్పారు. సుపరిపాలన, అభివృద్ధి చూసి ఓట్లేయాలని కోరారు. -
ఆ సూటు ఖరీదు రూ. 10 లక్షలు!
ప్రధాని నరేంద్రమోదీ మీద కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంలో మోదీ వేసుకున్న సూటు ఖరీదు అక్షరాలా రూ. 10 లక్షలని ఆయన ఆరోపించారు. ఆ సూటు నిండా తన పేరు కుట్టించుకుని ప్రచారం చేసుకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయులను మోసం చేశారన్నారు. ఆక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే.. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన విమర్శించారు. -
మేనిఫెస్టో లేదు.. విజన్ డాక్యుమెంటే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తాము మేనిఫెస్టో ఏదీ విడుదల చేయబోమని, కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే ఇస్తామని బీజేపీ తెలిపింది. ఆ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కలిసి విడుదల చేస్తారని పార్టీ నాయకులు చెప్పారు. 'బీజేపీ ఈసారి మేనిఫెస్టో విడుదల చేయదు. ప్రధానమంత్రి మోదీ, సీఎం అభ్యర్థి బేడీ కలిసి విజన్ డాక్యుమెంట్ మాత్రమే విడుదల చేస్తారు' అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈనెల 31, ఫిబ్రవరి 1, 3, 4 తేదీల్లో మోదీ నాలుగు ర్యాలీల్లో ప్రసంగిస్తారన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రతిరోజూ తమ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు వేస్తుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు 10న వెల్లడవుతాయి. -
ఆప్... బీజేపీ బీ టీం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీటర్లో పేర్కొన్నారు. బలహీనమైన దుష్టశక్తిగా భావించనందువల్లనే 2013 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించామన్నారు. ‘ఆప్.. బీజేపీ బీ టీం., మరి అటువంటపుడు ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారని మీరడిగితే బలహీనమైనశక్తినే ఎంచుకున్నామని చెప్పాల్సి ఉంటుంది’ అని అన్నారు. ‘2010లో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంఘ్ సిద్ధాంతకర్తలైన ఎస్.గురుమూర్తి, కేఎన్ గోవిందాచార్య తదితరులతో కలసి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారన్నారు. అది నిజం కాదే. అదే సమావేశంలో రాందేవ్, రవిశంకర్ ప్రతినిధి కూడా పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. తాను చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమేనన్నారు. కొట్టిపారేసిన బీజేపీ కాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్వీటర్లో చేసిన వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసింది. మరిఅంతా తెలిసికూడా ఆప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు మద్దతు ఇచ్చారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.. దిగ్విజయ్‌ని నిలదీశారు. -
కమలం కంచుకోటకు బీటలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీకి తలమానికమైన జనక్‌పురిని బీజేపీకికంచుకోటగా పేర్కొంటారు. ఆ పార్టీ సీనియర్ నేత జగ్దీశ్ముఖి ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ముఖిని ఓడించడం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆ పార్టీ బరిలోకి దించినఅభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖి కంచుకోటకు బీటలు బారిందనే విషయం గత ఎన్నికల్లోనేస్పష్టమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాజేష్ రుషి గత ఎన్నికల్లో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 2,644 ఓట్ల ఆధిక్యంతో ముఖి గెలుపొందారు. ఈసారి కూడా ఆప్ రుషినే బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ముఖి అల్లుడు సురేష్ కుమార్‌ను బరిలోకి దించింది. మామా అల్లుళ్ల పోరుపై జనక్‌పురి వాసులే కాకుండా ఢిల్లీవాసులు కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన అనంతరం ముఖ్యమంత్రి పీఠం జగ్దీశ్ ముఖికి కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఊహాగాపాలు వినిపించాయి. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ముఖి త నవంతు ప్రయత్నం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వర్సెస్ ముఖి పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా చేసింది. అయితే తాజాగా కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో సీఎంపై ముఖి ఆశలు కల్లలేనని తేలిపోయింది. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిత్వంపై ముఖి తన అసంతృప్త్తిని అధిష్టానానికి సూచనప్రాయంగా వ్యక్తం చేసినప్పటికీ చివరికి పార్టీ ఆదేశాన్ని శిరసావహించారు. ఒకప్పుడు జనక్‌పురిని కాలనీ ఆఫ్ పార్క్స్ అనేవారు. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అనధికార కాలనీలను కూడా ఇందులో చేర్చడంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల నేపథ్యం మారిపోయింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.70 లక్షలు. అందులోనూ పంజాబీ ఓటర్లు ఎక్కువ. ఇక రెండో స్థానంలో సిక్కులు, మూడోస్థానంలో పూర్వాంచలీయులు ఉన్నారు.