
ఆ సూటు ఖరీదు రూ. 10 లక్షలు!
ప్రధాని నరేంద్రమోదీ మీద కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంలో మోదీ వేసుకున్న సూటు ఖరీదు అక్షరాలా రూ. 10 లక్షలని ఆయన ఆరోపించారు. ఆ సూటు నిండా తన పేరు కుట్టించుకుని ప్రచారం చేసుకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయులను మోసం చేశారన్నారు. ఆక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే.. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన విమర్శించారు.