దేశ రాజధాని నగరమైన హస్తినలో ఎన్నికలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఆసక్తే.
దేశ రాజధాని నగరమైన హస్తినలో ఎన్నికలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఆసక్తే. అక్కడ కమలనాథులు పాగా వేస్తారా.. ఆప్ చీపురు దుమ్ము దులిపేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోడానికి అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. అందుకే 'సాక్షి టీవీ' ఈ ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్, నిపుణులతో చర్చా కార్యక్రమాలతో కూడిన 'బిగ్ డిబేట్'ను శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం చేయనుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు సంబంధించిన విశ్లేషణలు, ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉందనే అంచనాలు.. అన్నీ ఇందులో ఉంటాయి.