big debate
-
తాకట్టు నాయుడు.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు
-
జయము జయము చంద్రన్న పాటకు 23కోట్ల 11 లక్షలు.. విస్తుపోయే నిజాలు
-
పోలవరంపై రహస్య' రాజకీయం.. బయటపడ్డ తాకట్టు నాయుడు గుట్టు
-
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు.. ఎవరు ఊహించని ప్రమాదం!
-
కమలా హారిస్‌కు అండాదండా ఆమే!
Laurene Powell Jobs: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకున్నాక ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న కమలా హారిస్ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగుతోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హారిస్‌పై నమ్మకం నిలుపుకున్న ఏకైక వ్యక్తి లారెన్ పావెల్ జాబ్స్. వాళ్లది 20 ఏళ్ల స్నేహం. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన కాలం నుంచి ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగడం దాకా హారిస్‌కు చోదకశక్తిగా ఉన్నది లారెన్ పావెల్ అని చాలా మందికి తెలీదు. హారిస్‌కు ఆర్థిక, హార్దిక బలమూ ఆమే. ఆడదానికి ఆడదే శత్రువనే మూస ప్రచారాలను వెనక్కు నెట్టి ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల మరెంతో మంది మహిళలకు బాసటగా నిలుస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళిద్దరి స్నేహం.ఎవరీ లారెన్ పావెల్? 60 ఏళ్ల లారెన్ పావెల్ జాబ్స్... ఎమర్సన్ కలెక్టివ్ అనే దాతృత్వ, పెట్టుబడి సంస్థ వ్యవస్థాపకురాలు. ది అట్లాంటిక్ మేగజైన్లో పెద్ద వాటాదారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి ఈమె. పావెల్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఇక్కడే 1989లో స్టీవ్ జాబ్స్‌ను కలిశారు. 1991లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు రీడ్, ఎరిన్, ఈవ్. స్టీవ్‌జాబ్స్ మరణానంతరం ఆపిల్, డిస్నీ సంస్థల్లో వాటాలను ఆమె వారసత్వంగా పొందారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, పావెల్ ప్రస్తుత నికర విలువ 11.5 బిలియన్ డాలర్లు. ఆమె సిలికాన్ వ్యాలీలో అత్యంత సంపన్న మహిళగా పేరొందారు.హారిస్, లారెన్ స్నేహం.. ప్రజాజీవితం గడుపుతూ రాజకీయాలు, కళలు, సంస్కృతి పట్ల ఇద్దరూ ఒకే అభిరుచి కల్గిఉండటం ఇద్దరినీ స్నేహితులుగా మార్చింది. హారిస్‌కు నిధులు, సలహాలు అందించడమే కాకుండా ప్రజల్లో ఆదరణ పెరగడానికి లారెన్ దోహదపడ్డారు. లారెన్ కొన్నేళ్లుగా డెమొక్రటిక్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారు. 2020 నుంచి డెమొక్రటిక్ నామినీలకు, పార్టీకి దాదాపు రూ.29 కోట్ల విరాళం ఇచి్చనట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన సమయం నుంచే లారెన్.. హారిస్ వెన్నంటి ఉన్నారు. ఆ సమయంలో పావెల్ 500 డాలర్లు విరాళం ఇచ్చారు.తర్వాతి ఏడాది బే ఏరియాకు చెందిన ఇతర మహిళా నాయకులతో కలిసి వాషింగ్టన్లో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ ఉమెన్స్ లైవ్స్’లో ఇద్దరూ పాల్గొన్నారు. హారిస్ కోసం లారెన్ అనేక నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. గత ఏడాది కమల ప్రచారానికి ఆమె దాదాపు రూ.8.37 కోట్ల విరాళాలు ఇచ్చారు. 2017లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి లారెన్‌ను ప్రశ్నించగా.. ‘‘నా ఓటు హారిస్‌కే’ అంటూ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న తన స్నేహితురాలు హారిస్‌ను చూపించారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న చీలికలుహారిస్ను తెరపైకి తెచ్చి.. వాస్తవానికి జూన్‌లో బిగ్ డిబేట్ తర్వాత ప్రభ కోల్పోయిన బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించడానికి తెరవెనుక నుంచి లారెన్ పనిచేశారని అప్పట్లో వదంతులు వినిపించాయి. డిబేట్లో బైడెన్ పేలవ ప్రదర్శన చూశాక ట్రంప్‌ను ఓడించలేమేమో అని డెమొక్రటిక్ పార్టీ ప్రధాన దాతల వద్ద లారెన్ అభిప్రాయం వ్యక్తించేశారని వార్తలొచ్చాయి. పోటీలో కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టడంతో హారిస్ సలహాల కోసం లారెన్‌ను సంప్రదించినట్లు సమాచారం. హారిస్‌కు మద్దతుగా ఇతర మహిళా టెక్ నాయకుల మద్దతు కూడగట్టే బాధ్యతను లారెన్ తన భూజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ గెలిస్తే డెమొక్రాట్ల పాలనలో లారెన్ ఏదైనా పాలనా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారిక పదవిలో లేకపోయినా ‘ఇన్సైడర్’గా ఉంటారని తెలుస్తోంది. -
Big Question: వైయస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీల కొనుగోలు.. తెరపైకి బాబు, మోదీ కొత్త కుట్ర
-
KSR Live Show: చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి..
-
ఆటలో అరటిపండు అయ్యిందెవరు..?
-
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డేనా..?
-
కేసీఆర్ చేసిన అప్పులు వృధా.. ప్రజలు డిసైడ్ అయ్యారు..
-
కాంగ్రెస్ సీఎం రేసులో భట్టి.. ఆశించడంలో తప్పేమి లేదు..
-
టీడీపీ కండువా వేసుకోవడానికి కారణం అదే
-
100శాతం కాంగ్రెసే.. సీఎం సీటుపై భట్టి క్లారిటీ
-
ధరణి అనేది పెద్ద స్కాం.. భూస్వాములకు దోచిపెట్టేందుకే..
-
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం..
-
ఉచిత కరెంటు ఇచ్చింది వైఎస్ఆర్.. కేసీఆర్ పై ఫైర్
-
కాళేశ్వరం ప్రాజెక్ట్.. వేల కోట్లు మాయం..
-
కాంగ్రెస్‌కు మార్పు ఏం కావాలి..? యాడ్స్‌పై భట్టి కామెంట్స్
-
సూర్యాపేటలో మీ సీట్ సేఫెనా..?
-
కాంగ్రెస్ బోల్తా కొట్టింది.. నేను ఛాలెంజ్ చేస్తున్న..
-
Nov 28 జైల్లోకి రీఎంట్రీ ఇవ్వాల్సిందే
-
ట్రయాంగిల్ ఫైట్..గెలిచేది ఎవరు..?
-
బిగ్ మండే..టీడీపీ నేతల్లో టెన్షన్..
-
నారావారి అవినీతి బ్యాండు
-
సీఐడీ కస్టడీతో స్కిల్ స్కాం కుట్ర బయటపడుతుందా ?
-
జనసేనానిపై మహిళల న్యాయపోరాటం
-
డబుల్ రాజకీయం..డొల్లతనానికి బాధ్యులెవరు...?
-
చేతలు తక్కువ.. మాటలు ఎక్కువ
-
ఈ తిక్కకు లెక్కలేదు
-
50 వేల కుటుంబాలలో సొంతింటి వెలుగులు
-
ఇది నీకు..ఇది నీకు..ఇది నాకు..నందిని ఎలా పంచుకున్నారంటే..
-
ఆ అవార్డ్ అంటే చంద్రబాబుకు తొక్కతో సమానం
-
బిగ్ క్వశ్చన్: అడ్డగోలు వార్తలు రాసి.. అడ్డంగా బుక్కయ్యాడు
-
బిగ్ క్వశ్చన్: గన్నవరంలో అసలు జరిగింది ఏంటి?
-
బిగ్ క్వశ్చన్: వెనుకబడిన వర్గాల్లో శ్రమను పరిశ్రమను చూసిన నాయకుడు
-
బిగ్ క్వశ్చన్: అనపర్తిలో చంద్రబాబు ఓవరాక్షన్
-
బిగ్ క్వశ్చన్: బాబు రోడ్డెక్కినా ఫలితం లేదని జగ్గంపేటలో తేలిపోయిందా?
-
ఏపీలో పారిశ్రామిక ప్రగతి అగ్రగామిగా నిలిపిన సీఎం జగన్ విజన్
-
బిగ్ క్వశ్చన్: బీఆర్ఎస్తో పొత్తు కాంగ్రెస్‌లో ఓ వర్గం కోరుకుంటోందా?
-
బిగ్ క్వశ్చన్ : నేడు యువ శక్తి.. నాడు డాడీ భక్తి
-
బిగ్ క్వశ్చన్: కుప్పంలో కుట్ర
-
సరికొత్త ఆలోచనతో జగన్.. డర్టీ పాలిటిక్స్ తో బాబు
-
బిగ్ క్వశ్చన్: పేరుకు కమ్యూనిజం లోపలంతా ఎల్లో ఇజం
-
బిగ్ క్వశ్చన్: టీ కాంగ్రెస్ లో ముదురుతున్న పంచాయితి
-
అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ బిగ్ డిబేట్
-
కమల హారిస్, మైక్ పెన్స్ ముఖాముఖి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి సాల్ట్‌లేక్‌లోని కింగ్స్ బర్రీహాల్‌లో ప్రారంభమైంది. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్ మాస్క్ ఏర్పాటు చేశారు. ముఖాముఖిలో భాగంగా మొదటిగా డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని, అమెరికా చరిత్రలో ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడని తెలిపారు. కమల విమర్శలను రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ ఖండిస్తూ.. కరోనాపై ఐదు కంపెనీలు ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని తెలిపారు. కరోనా వాక్సిన్ రూపకల్పనలో భాగంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికన్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని సమాధానం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అసమర్థతో అమెరికా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కమల హారిస్ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఒబామా కేర్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అయితే ఒబామా కేర్‌ను ట్రంప్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇరువురు ఉపాధ్యక్ష అభ్యర్థులు పలు అంశాలపై చర్చ కొనసాగిస్తున్నారు. -
బిగ్ డిబేట్
-
గ్రామ వార్డు సచివాలయలపై బిగ్ డిబేట్
-
మహిళల లక్ష్య సాధనకు ‘దిశ’ నిర్దేశం
సాక్షి, ఏలూరు: మహిళలు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ‘దిశ’ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు అన్నారు. దిశ చట్టంపై సాక్షి టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల్లో ఎదగాలని ఎంతో తపన ఉన్నప్పటికి అత్యాచార ఘటనల వల్ల అభద్రత భావానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెంటనే శిక్షించాలని కోరారు. దిశచట్టం తో మహిళలపై దాడులు తగ్గుతాయనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. దిశ చట్టం తీసుకురావడంతో అమ్మాయిల కన్నా.. అబ్బాయిల తల్లిదండ్రులే ఎక్కువ భయపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. -
సంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్..
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి డిబేట్ లో తన ప్రసంగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌తో చర్చలో హోరా హోరీగా తలపడటంపై ఆయన సంతృప్తి చెందారు. చర్చ ముగిసిన అనంతరం వివిధ అంశాలపై తాను వెల్లడించిన అన్ని విషయాలు ఉత్తేజకరంగా ఉన్నాయన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ ఆయన ట్విట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అమెరికా లాస్‌వెగాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నెవాడాలో బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) చివరి డిబేట్ 90 నిమిషాలు పాటు జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకున్నారు. సూటిగా సమాధానాలు ఇస్తూనే, ఒకరిపై మరొకరు చెణుకులు విసురుకున్నారు. ఒపీనియన్ పోల్స్‌లో చాలా వెనుకబడ్డ ట్రంప్ కీలకమైన మూడవ చర్చలో పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో ఆయన కొద్దిపాటి అసహనంతో పాటు చికాకు పడ్డారు. అంతేకాకుండా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి కౌంటర్ చేసేందుకు చమత్కారంగా సమాధానం ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. గన్ కల్చర్, అక్రమ వలసదారులు, అబార్షన్ హక్కులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం హిల్లరీ ముందంజలో ఉన్నారు. That was really exciting. Made all of my points. MAKE AMERICA GREAT AGAIN! — Donald J. Trump (@realDonaldTrump) 20 October 2016 -
సమాధానం దాటవేసిన డొనాల్డ్ ట్రంప్
లాస్ వెగాస్ :ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే అప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన చివరి డిబేట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తాను అప్పుడే అంగీకరించబోనని, తనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఆరోపించారు. కాగా గతంలో ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి పార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై డిబేట్ మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ వేసిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేశారు. ఎన్నికల ఫలితాలను గౌరవించాలా? లేదా? అనే దానిపై నవంబర్ ఎనిమిదిన నిర్ణయించుకుంటానని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగితేనే బాగుంటుందన్నారు. మా నాన్నదే విజయం: ఇవాంకా మరోవైపు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మాత్రం... ఎన్నికల ఫలితాలను తన తండ్రి అంగీకరిస్తారని అన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవాంకా ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల్లో తన తండ్రే గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకన్నా ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు తాను ఇష్టపడనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధించినా, ఓడిపోయినా తన తండ్రి ఫలితాలను అంగీకరిస్తారని తెలిపారు. తన తండ్రి ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని ఆమె అభిప్రాయపడింది. తన తండ్రి గురించి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. -
కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ బిగ్ డిబేట్ లో పాల్గొన్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈసారి కూడా వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా కరచలనం చేసుకోలేదు. బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) హిల్లరీ, ట్రంప్‌ల మూడో, చివరి డిబేట్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆఖరి డిబెట్లో భాగంగా డెమక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులుగా రేసులో ఉన్న హిల్లరీ, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే తమ ప్రసంగాలు ప్రారంభించటం విశేషం. కనీసం ప్రత్యర్థులు ఇద్దరూ చిరునవ్వు కూడా నవ్వలేదు. బిగ్ డిబెట్ ముగిసినా తర్వాత కూడా వాళ్లిద్దరూ కరచలనం చేసుకోలేదు సరికదా, ఒకరి వైపు మరొకరు చూడను కూడా చూడలేదు. కాగ గత రెండు డిబేట్లలో ట్రంప్ పై హిల్లరీనే పై చేయి సాధించిన విషయం తెలిసిందే. 90 నిమిషాల ఈ డిబేట్‌ని ఆరు విభాగాలుగా విభజించారు. జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్‌గా ఫిట్నెస్ తదితర అంశాలపై మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ ప్రశ్నలు సంధించారు. చివరి డిబేట్ లోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇరువురు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు పోటీపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పురుషులతోపపాటు మహిళలకు సమానంగా హక్కులు కల్పిస్తామని హిల్లరీ హామీ ఇచ్చారు. కాగా నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. హిల్లరీ క్లింటన్ వైట్ ప్యాంట్, వైట్ కోటు ధరించి రాగా, ట్రంప్ బ్లాక్ కోటు, వైట్ షర్ట్, రెడ్ టై ధరించి వచ్చారు. ట్రంప్ టీమ్ బోయింగ్ 757 విమానంలో రాగా, హిల్లరీ టీమ్ బోయింగ్ 737 విమానంలో వచ్చింది. -
హోరా హోరీగా ట్రంప్, హిల్లరీ బిగ్ డిబేట్..
లాస్ వేగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన మూడో, చివరి డిబేట్ పరస్పర ఆరోపణలతో యూనివర్సిటీ ఆఫ్ నెవెడాలో వాడీవేడిగా సాగింది. ఒకరిని ఒకరు కరచాలనం చేసుకోకుండానే డిబేట్ ప్రారంభించారు. మూడో బిగ్ డిబేట్లో సుప్రీం కోర్టు, అబార్షన్, ఇమిగ్రేషన్, ఎకానమీ, ఫిట్నెస్ టు బి ప్రెసిడెంట్, ఫారిన్ హాట్ స్పాట్స్, ది నేషనల్ డెబ్ట్, డెబ్ట్ ఎంటైటిల్ మెంట్ అంశాలపై చర్చ సాగింది. సుప్రీం కోర్టు ప్రజల పక్షాన ఉండాలి, కంపెనీల వైపు కాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. గన్ కల్చర్ మన సంస్కృతిలో భాగమేనని ట్రంప్ అన్నారు. తుపాకులపై నియంత్రణ ఉండాలని హిల్లరీ తెలిపారు. వలసలపై హిల్లరీ విధానం దారుణంగా ఉందని ట్రంప్ మండిపడ్డారు. దేశంలోకి డ్రగ్స్ వెల్లువలా వస్తున్నాయి, మనకు పటిష్టమైన సరిహద్దులుండాలని ట్రంప్ పేర్కొన్నారు. ఒబామా కొన్ని లక్షల మందిని దేశం నుంచి పంపేశారు, దాని గురించి హిల్లరీ ఎందుకు మాట్లాడదన్నారు. రెండో రాజ్యాంగ సవరణకు తాను మద్దతిస్తున్నాని హిల్లరీ తెలిపారు. హిల్లరీవి మాటలు తప్ప చేతలు ఉండవని ట్రంప్ అన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా హిల్లరీ ఉన్న సమయంలోనే 6బిలియన్ డాలర్లు ఎక్కడికి తరలించారో చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. మహిళలకు తాను ఇచ్చినంత గౌరవం ఎవరూ ఇవ్వరు అని ట్రంప్ అనడంతో ఆడియన్స్ విరగబడి నవ్వగా, సంధానకర్త నిశబ్దంగా ఉండాలని సూచించారు. చైనా, వియత్నాం నుంచి ఉత్పత్తులు వెల్లువలా వస్తున్నాయని ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే.. చైనా కంపెనీలు వద్దని ట్రంప్ అంటున్నారు. కానీ, లాస్ వెగాస్‌లోని హోటల్‌ను చైనా స్టీల్‌తో నిర్మించారని హిల్లరీ ధ్వజమెత్తారు. అమెరికా ప్రభుత్వ మెయిల్స్‌ను రష్యా హ్యాక్ చేస్తోందని, వికీలీక్స్ వెనకు రష్యా ఉందని హిల్లరీ ఆరోపించారు. ప్రతిదానికి హిల్లరీ రష్యాను బూచిగా చూపిస్తున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. శ్వేత సౌధంలో కీలు బొమ్మ ఉండాలని పుతిన్ భావిస్తోన్నారని హిల్లరీ అన్నారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా అమెరికా, రష్యా కలిసుండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి వస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని హిల్లరీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు ఊతమిస్తామన్నారు. 30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నారు...ఇప్పటి వరకు మీరేం చేశారని ట్రంప్ మండిపడ్డారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పిస్తామని ట్రంప్ తెలిపారు. -
రికార్డు బద్దలు కొట్టిన ‘బిగ్ డిబేట్’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్–హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన తొలి ముఖాముఖి చర్చ రికార్డు బద్దలు కొట్టింది. అమెరికా టీవీ చరిత్రలో 36 ఏళ్ల కిందటి రికార్డును మంగళవారం జరిగిన ట్రంప్–హిల్లరీ తొలి చర్చ అధిగమించింది. రికార్డు స్థాయిలో 8.4 కోట్ల మంది చర్చను వీక్షించారు. 1980లో జిమ్మి కార్టర్–రొనాల్డ్ రీగన్ మధ్య జరిగిన చర్చను 8 కోట్ల మిలియన్ల మంది చూశారు. ప్రస్తుత హిల్లరీ–ట్రంప్ చర్చలో 13 ప్రధాన టీవీ ఛానల్ల వీక్షకులనే లెక్కలోకి తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్లో చూసిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. హ్యాంప్స్టెడ్లోని హాఫ్‌స్ట్రా వర్సిటీలో జరిగిన ఈ 98 నిమిషాల చర్చను వీక్షకులు కదలకుండా చూశారని నిల్సన్ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ. ‘తొలి చర్చ టెలివిజన్ చరిత్రలో రికార్డు బద్దలుకొడుతుందని నాకు తెలుసు. భారీగా ఊపిరి తీసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు మాట్లాడా’ అని చెప్పారు. కాగా, మరో రెండుసార్లు అక్టోబర్ 9, 19 తేదీల్లో ట్రంప్–హిల్లరీ మధ్య చర్చ జరగనుంది. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ఢిల్లీ ఎన్నికలపై బిగ్ డిబేట్
దేశ రాజధాని నగరమైన హస్తినలో ఎన్నికలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఆసక్తే. అక్కడ కమలనాథులు పాగా వేస్తారా.. ఆప్ చీపురు దుమ్ము దులిపేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోడానికి అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. అందుకే 'సాక్షి టీవీ' ఈ ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్, నిపుణులతో చర్చా కార్యక్రమాలతో కూడిన 'బిగ్ డిబేట్'ను శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం చేయనుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు సంబంధించిన విశ్లేషణలు, ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉందనే అంచనాలు.. అన్నీ ఇందులో ఉంటాయి.