ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. బలహీనమైన దుష్టశక్తిగా భావించనందువల్లనే 2013 ఎన్నికల
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. బలహీనమైన దుష్టశక్తిగా భావించనందువల్లనే 2013 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించామన్నారు. ‘ఆప్.. బీజేపీ బీ టీం., మరి అటువంటపుడు ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారని మీరడిగితే బలహీనమైనశక్తినే ఎంచుకున్నామని చెప్పాల్సి ఉంటుంది’ అని అన్నారు. ‘2010లో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంఘ్ సిద్ధాంతకర్తలైన ఎస్.గురుమూర్తి, కేఎన్ గోవిందాచార్య తదితరులతో కలసి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారన్నారు. అది నిజం కాదే. అదే సమావేశంలో రాందేవ్, రవిశంకర్ ప్రతినిధి కూడా పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. తాను చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమేనన్నారు.
కొట్టిపారేసిన బీజేపీ
కాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్వీటర్‌లో చేసిన వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసింది. మరిఅంతా తెలిసికూడా ఆప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు మద్దతు ఇచ్చారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.. దిగ్విజయ్‌ని నిలదీశారు.