న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ జరుగుతోంది. తూర్పు ఢిల్లీలోని రోహ్ తాస్ నగర్ లో బూతు నంబరు132, డీఐడీ లైన్స్ ఏరియాలోని నంబరు 31 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఉప ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈవీఎం లు పని చేయకపోవటంతో ఆ రెండు కేంద్రాల్లో ఆరోజు పోలింగ్ జరగలేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. శనివారం జరిగిన పోలింగ్లో 67.14 శాతం పోలింగ్ నమోదైంది.