హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ స్వింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.
అసెంబ్లీ దగ్గర రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్క, చెల్లెమ్మలకు రాఖి పండుగ శుభాకాంక్షలు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు తీసుకువచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించాం. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మహిళల రక్షణ విషయంలోను మా ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు. మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ మను వెళ్ళడం వలన మన రాష్ట్రానికి అన్నివిధాల న్యాయం జరుగుతుంది. అభిషేక్ సింఘ్వీ మను రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.
ఆదివారం సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ తీర్మాణం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో నా వాదన వినిపిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment