
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.
కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment