ఆర్ఎస్ఎస్ చేతిలో మోడీ కీలుబొమ్మ:కాంగ్రెస్
న్యూఢిల్ల్లీ: దేశ వ్యాప్తంగా ప్రచార ఘట్టాలకు తెరపడి తుది విడత పోలింగ్ కు సమయం దగ్గర పడినా కాంగ్రెస్ మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకూ ఎన్నికల సభల్లో ఒకరిపై ఒకరు మాటల తూటాల పేల్చుకున్న ఇరు పార్టీలు అదే స్థాయిలో ముందుకెళుతున్నాయి. ఆదివారం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశం కావడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.' ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు నడుచుకోవడం మోడీకి అలవాటు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ చేతిలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఒక కీలుబొమ్మ. వారి వాక్కే.. మోడీకి వేదవాక్కు'అంటూ కాంగ్రెస్ మండిపడింది.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పినట్లే యూపీఏ ప్రభుత్వం నడుచుకుంటుందని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. తమ అధినేత్రిని విమర్శించే మోడీ.. ఆర్ఎస్ఎస్ నడిపించే వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు.