సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య అనితా సింఘ్వీకి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.అనితా సింఘ్వీ నీరవ్ మోదీ నుంచి రూ 6 కోట్ల విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేశారని, దీనికి సంబంధించి రూ 1.5 కోట్లు చెక్కు ద్వారా, మిగిలిన మొత్తం నగదు రూపంలో చెల్లించారని ఆరోపణలున్నాయి. నగదు రూపంలో చెల్లింపులకు సరైన ఆధారాలు చూపాలని ఐటీ అధికారులు కోరినట్టు తెలిసింది.
దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీ కార్యాలయాల్లో సీబీఐ, ఈడీ జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో అనిత సింఘ్వీ ఆభరణాల కొనుగోళ్లు వివరాలున్నాయని సమాచారం. ఈ పత్రాల్లోనే లెక్కల్లో చూపిన సొమ్ము..లెక్కల్లో చూపని సొమ్ము అనే కాలమ్స్‌ను అధికారులు గుర్తించారు. పీఎన్‌బీలో నీరవ్ మోదీ రూ 11,300 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment