'హామీ నిలబెట్టుకోకే ఉద్యమం తీవ్రరూపం' | abhishek singhvi attack on chandrababu | Sakshi
Sakshi News home page

'హామీ నిలబెట్టుకోకే ఉద్యమం తీవ్రరూపం'

Feb 1 2016 8:01 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలం కావడం మూలంగానే కాపుల ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలం కావడం మూలంగానే కాపుల ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తాజా పరిణామాలపై సోమవారం మాట్లాడిన ఆయన.. టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు.

పవన్ కళ్యాణ్తో జతకట్టి కాపుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు వారిని పట్టించుకోలేదన్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement