![చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదా? బాగా వచ్చు.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51426839525_625x300.jpg.webp?itok=czPdhkDO)
చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదా? బాగా వచ్చు..
హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది నెలలు గడిచిందని, అయినా ఇప్పటివరకూ విభజన హామీలు అమలు జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజన అంశాలు గురించి ఏపీ అసెంబ్లీలో తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరగాయని, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా గట్టిగా నిలదీశామని ఆయన ప్రెస్మీట్లో గుర్తు చేశారు.
'ఇప్పటివరకూ విభజన హామీలు అమలు జరగలేదని..తెలుగు మీడియాకు మాత్రం బోర్ కొట్టినట్లు చెప్పుకుంటా పోతాడు. కాని ఇదే విషయాన్ని ఇంగ్లీష్ మీడియాకు గాని, నేషనల్ మీడియాకు గాని చెప్పడు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదా? వచ్చు, బాగావచ్చు. అయినా నేషనల్ మీడియాకు చెప్పడు. ఒకవేళ చెప్తే..నరేంద్ర మోదీగారికి తెలుస్తుంది. ఆయనకు తెలిస్తే.ఈయనకు నష్టం జరుగుతుంది. అందుకే చంద్రబాబు చచ్చినా చెప్పడు. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నాడు.
మేం అంటే ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కూడా ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సాయం చేయని కోరాం. కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసి..వారికి విజ్ఞాపన పత్రాలు అందించాం. వాటి వివరాలను మీడియాకు విడుదల చేశాం. మీ టీడీపీ మంత్రే కేంద్రంలో విమానయాన శాఖమంత్రిగా పని చేస్తున్నారు. కాని విజయవాడ, విశాఖ విమానాశ్రయాల విస్తరణకు నిధులు ఇవ్వకపోవడంపై తెలుగు మీడియా వద్ద అయితే మాట్లాడతారు.
కాని ఇంగ్లీష్ మీడియాతో ఎందుకు మాట్లాడరు. టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల వల్ల..రాష్ట్రానికి ఒక్క దమ్మిడీ మేలు అయినా జరిగిందా? వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు దగ్గర నుంచీ గ్రీన్ ఫీల్డ్ చమురు కర్మాగారం వరకూ ఆరు నెలల్లో స్పందించాల్సిన హామీలు చాలా ఉన్నాయని' వైఎస్ జగన్ పేర్కొన్నారు.