
'ఎంఐఎం నిర్ణయం బీజేపీకి ఉపయోగం'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుందని ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఆ పార్టీ కంటే బీజేపీకే లాభమని సింఘ్వి అభిప్రాయపడ్డారు. అసుదుద్దీన్ ఈ విషయంపై ఆలోచించుకోవాలని కోరారు.
బిహార్లోని సీమాంచల్ ప్రాంతంలో 40 అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎం పోటీ చేయనున్నట్టు అసదుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల తమ పార్టీకి లాభమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు సింఘ్వి చెప్పారు.