సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ భక్షకుడిలా తయారైయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితతో కుటుంబ పాలనతో తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. థగ్స్ (చీటింగ్) ఆప్ టీఆర్‌ఎస్ ఇన్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అన్ని రంగాల్లో మోసం చేసిందని.. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని విస్మరించారని మండిపడ్డారు.
విద్యార్థులను కనీస వసతులు కల్పించకుండా కేజీ టూ పీజీ అమలు చేశామని చెప్పడానికి సిగ్గలేదా అని ఘాటుగా స్పందించారు. 1200 మంది అమరుల కుటుంబాలను ఆదుకుంటామని.. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మండిపడ్డారు. అవినీతిలో తెలంగాణ దేశంలో రెండవ రాష్ట్రంగా నిలిచిందని.. కమీషన్ల కోసమే కేసీఆర్ పథకాలను పెట్టారని వ్యాఖ్యానించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరే విధంగా పాలన అందిస్తామని సింఘ్వీ తెలిపారు.
కాంగ్రెస్‌కు 66-70 స్థానాలు..
కాంగ్రెస్‌లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఇటీవల ఆయన టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కనీస వివరణ అడగకుండా టీఆర్‌ఎస్ నుంచి తనను బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు నారాయణ రెడ్డి తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వేలోనే మహాకూటమికి 66-70 స్థానాలు వస్తాయని తేలిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment