
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా భద్రతా సిబ్బంది సహా 1.15 కోట్ల ప్రభుత్వ ఉద్యోగు లకు తక్షణమే డీఏ(కరువు భత్యం) విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వేతనాలు తగ్గుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఉద్యోగుల జీవితాలతో తమషాలు చేయ వద్దని, వారి ఇబ్బందులను పట్టించు కోవాలని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి శనివారం కేంద్రాన్ని కోరారు.
గత ఏడాది నిలిపివేసిన డీఏను తక్షణమే పునరుద్ధరించి, ఏడో వేతన సంఘం సిఫారసుల ప్రకారం డీఏ ఎరియర్స్‌ను చెల్లించాలన్నారు. కోవిడ్ సమ యంలో, దేశానికి సేవలందిస్తున్న 1.13 కోట్ల మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచడానికి బదులు వారి కష్టార్జితాన్ని లాగేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సైనికులు, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి రూ.37,500 కోట్లను లూటీ చేయడం నేరమని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
చదవండి: మత్తు బానిసలు 275 మిలియన్లు!
Comments
Please login to add a commentAdd a comment