బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ.. ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా బీజేపీలో జరగుతున్న అంతర్గత పోరాటం, సీనియర్ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇది అర్థమవుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన కామెంట్లు పోస్ట్ చేశారు.
Modi is the self destruct mantra of bjp. Last few days implosions and explosions in bjp are only precursor to real firefight in the offing
— Abhishek Singhvi (@DrAMSinghvi) March 25, 2014
సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తదితర పరిణామాలపై సింఘ్వీ స్పందించారు. అద్వానీ, జస్వంత్ సింగ్, హరీన్ పాఠక్, రాజేంద్ర సింగ్ రాణా, లాల్ ముని చౌబే, లాల్జీ టాండన్ లాంటి వాళ్లే నరేంద్ర మోడీని విశ్వసించకపోతే.. ఇక జాతి ఆయనను ఎలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు. మీ సొంత మనుషులే నమ్మకపోతేప దేశం ఎలా నమ్ముతుందని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
If Advani, Jaswant, Harin pathak, Rana, Chaubey, Lalji Tandon cannot trust Modi, how can the nation? Jab apne tumhare nahin to Desh kaise?
— Abhishek Singhvi (@DrAMSinghvi) March 25, 2014