తెలంగాణ బిల్లు గట్టెక్కడం మిలియన్ డాలర్ ప్రశ్న: కాంగ్రెస్
ప్రస్తుత సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు గట్టెక్కడం కష్టమేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీతో సహా ఐదు పార్టీలు లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే తీరును ప్రశ్నిస్తున్న నేపథ్యంలో గట్టేక్కడం కష్టమేనని సింఘ్వీ అన్నారు.
ఫిబ్రవరి 21 తేదితో ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం ప్రశ్నార్థకంగా మారింది. లోకసభలో తెలంగాణ బిల్లు ఏర్పాటు అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ బిల్లుపై చర్చ జరగలేదని.. అయితే బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పీకర్ మీరా కుమార్ చేసిన ప్రకటననే కీలకం అని అన్నారు. స్పీకర్ ప్రకటననే ఫైనల్ అని.. సవాల్ చేయడానికి చాన్సే లేదని ఆయన అన్నారు.