అద్భుతంగా రాజన్న ఆలయం
► ఐదేళ్లలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కేటీఆర్
► సిరిసిల్ల, వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి, సిరిసిల్ల: దేశంలోనే అరుదైన శైవ క్షేత్రంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవ స్థానాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి çపరిచేందుకు బ్లూప్రింట్ రూపొం దించి చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో పురోగతి కనిపిస్తోందని, రాబోయే నాలుగై దేళ్లలో పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. సోమవారం వేములవాడ రాజన్న ఆల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు.
‘‘రూ.400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనుల కోసం ఏటా రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేసింది. నాంపల్లి గుట్టను కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గుడి చెరువు కింది 35 ఎకరాల స్థలాన్ని సేకరించి, పనులు ప్రారం భించడానికి మరో 9 నెలల సమయం పడు తుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అ మలు పరుస్తాం. గతంలో వేములవాడ గుడికి వస్తే పదవులు పోతాయని దుష్ప్రచారం చేశారు. సీఎం గుడికి వచ్చి ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేశారు’’అని పేర్కొన్నారు.
దర్శనానికి మరోసారి వస్తా..
వేములవాడ రాజన్న దర్శనానికి మరోసారి వస్తానని కేటీఆర్ చెప్పారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నా రని, తాను దర్శనానికి వెళ్తే కనీసం గంట పాటు క్యూలైన్ నిలిపివేయాల్సి వస్తుంద న్నారు. భక్తులను ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను తప్ప రాజన్నను దర్శించుకొంటే పదవులు పోతాయనే భయంతో కాదంటూ చమత్కరించారు.
మహిళా సంఘాలకు జీరో వడ్డీ నిధులు
రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రెండు మూడ్రోజుల్లో జీరో వడ్డీకి సంబంధించిన నిధులను బ్యాంకుల్లో జమ చేస్తామని కేటీఆర్ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేములవాడ మున్సి పల్, దేవాలయ అభివృద్ధిపై అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
రాజన్న భక్తులకు ఆన్ లైన్ సేవలు
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో ఆన్లైన్ సేవలను మంత్రి కె.తారకరామారావు సోమవారం ప్రారంభించారు. తద్వారా భక్తులకు గదుల సమాచారంతోపాటు ఇతరత్రా సేవలు ఆన్లైన్లోనే అందు బాటులో ఉండే వెసులు బాటు కలిగినట్లయింది.