రాజకీయ పార్టీలు పాతనోట్లను డిపాజిట్ చేస్తే ఐటీ విచారణ ఉండదంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఐటీ విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా చట్టాల్లో కొత్తగా మార్పులేమీ చేయలేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. చట్టప్రకారం పార్టీల అకౌంట్లను కూడా తనిఖీ చేస్తామన్నారు.