నోట్ల రద్దుపై ఎవరేమన్నారంటే..
• పసిడికి తక్షణం ఇబ్బందే..
• ప్రభుత్వ నిర్ణయంపై జువెలరీ పరిశ్రమ అభిప్రాయం
న్యూఢిల్లీ: దేశంలో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం పసిడికి శుభ సూచకమని పరిశ్రమ పేర్కొంది. కరెన్సీ నోట్ల కన్నా, విలువైన మెటల్‌పై విశ్వాసం పెంచుకోవాలన్న అభిప్రాయం ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో బలపడుతుందని పరిశ్రమ విశ్లేషించింది. పలువురి అభిప్రాయాలను చూస్తే...
స్వల్పకాలానికి ప్రతికూల ప్రభావం...
నిర్ణయం స్వల్ప కాలం ఇబ్బందిని కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూలత ఉంటుంది. అరుుతే మొత్తంగా చూస్తే- దేశానికి ఇది మంచిదే. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమకు సానుకూలం. కరెన్సీ నోట్లకన్నా, ఆభరణాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఇక సాధారణ మానవునిపై తక్షణ ప్రభావాన్ని చూస్తే- మీరు కూరగాయలు కొనాలనుకుంటారు. చిన్న నోట్లు లేకపోతే మీరు ఏమిచేస్తారు?
- మెహుల్ చోక్సి, గీతాంజలి జెమ్స్ సీఎండీ
స్వల్పకాలిక ప్రభావం...
ర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో మంచి నిర్ణయమే. ప్రత్యేకించి వ్యవస్థీకృత రం గానికి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. పసిడికి డిమాండ్ పెరగడానికి దోహదపడుతుంది.
- బల్‌రామ్ గార్గ్, పీసీ జ్యూయెలర్స్ ఎండీ
అసంఘటిత రంగానికి సమస్య...
దేశంలో అన్ని పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. పసిడికి సంబంధించి అసంఘటిత రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సంఘటిత రంగానికి మాత్రం సానుకూలమే. దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపే ప్రధాని ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం.
- జీ శ్రీధర్, జీజేటీఎఫ్