నోట్ల రద్దుపై నోరిప్పాలంటూ విపక్షాలు మూకుమ్మడిగా చేసిన డిమాండ్‌కు ప్రధాని మోదీ స్పందించారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు కోరినట్లుగా పార్లమెంటులో కాకుండా, గురువారం బీజేపీ పార్లమెంటరీ భేటీలో ఆయన తన వాదన వినిపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కారణమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లక్ష్యంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కన్నా కాంగ్రెస్‌కు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ధ్వజమెత్తారు. 1971లో ఇందిరాగాంధీ హయాంలోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే.. దేశం ఇంతగా నాశనమయ్యేది కాదని వ్యాఖ్యానించారు.