కోల్‌కతా: పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధన 169 కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ బుధవారం వరకు ముగిసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీపీఎం, కాంగ్రెస్ ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలన్న అధికార పార్టీ డిమాండ్‌ను అవి వ్యతిరేకించాయి. ‘నల్లధనానికి మేం వ్యతిరేకమే. నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రణాళిక లేకుండా తీసుకున్నారు. దీంతో నగదు సరఫరా ఆగిపోయింది. దేశంలో మాంద్యం లాంటి వాతావరణం నెలకొంది. మోదీ నాయకత్వం వల్ల ఎప్పుడూ చూడని పరిస్థితులు తలెత్తాయి’ అని ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అన్నారు.
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ తీర్మానం
Published Thu, Dec 8 2016 3:17 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement