West Bengal Assembly
-
శ్రీరామ నవమి ఇకపై ప్రభుత్వ సెలవుదినం!
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల కొట్లాట
-
బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్
లక్నో: పశ్చిమబెంగాల్ శాసనసభలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నేతల మధ్య తోపులాటలు జరిగాయి. రాంపూర్హాట్, బీర్భూమ్ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందర్ ముక్కుకు గాయమైంది. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందుతో సహా అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువిందు సహా బీజేపీ సభ్యులందరూ సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ కాగా పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. టీఎంసీ నాయకుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై పలు కేసులు నమోదు చేసింది. -
బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్‌లో బైఠాయించారు. శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రసంగాన్ని విరమించి, బయటకు వెళ్లిపోయేందుకు గవర్నర్ సన్నద్ధం కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు. (చదవండి: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?) -
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్‌కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్‌పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్‌కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్‌ఖర్‌ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్‌కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్‌ఖర్‌ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ స్పీకర్‌కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్‌ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్‌ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు. -
వాళ్లు రెచ్చగొడతారేమో.. మీరు రెచ్చిపోకండి
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఎంసీ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు పలువురు మృతి చెందడం, గాయపడటం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఘటనలపై నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రాంతాల్లో బీజేపీ సహా పలు రాజకీ య పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరిగాయనీ, దీనిపై నివేదిక అడిగినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో తెలిపారు. బుర్ద్వాన్‌లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల నడుమ ఆది, సోమవారాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తమ కార్యకర్తలేనంటూ టీఎంసీ ప్రకటించింది. కాగా, ప్రత్యర్థుల దాడిలో నందిగ్రామ్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయం తగులబడి పోతుండగా, ప్రజలు పరుగులు తీస్తున్నట్లున్న వీడియోను ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దాడుల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలు నలుగురితోపాటు దుస్తుల దుకాణాన్ని లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. తృణమూల్ శ్రేణుల దాడుల్లో తమ పార్టీ మద్దతుదారులు ఆరుగురు చనిపోగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.అయితే మహిళ మరణంపై ఆయన కుమారుడు, స్థానిక బీజేపీ నాయకుడు ఆశిష్ క్షేత్రపాల్ మాట్లాడుతూ..ఉదయం 11 గంటల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఖేలాహోబ్ (ఆట మొదలైంది) నినాదాలు చేస్తూ దాడులకు తెగబడ్డారు. మేం ప్రతిఘటించడంతో టీఎంసీ మద్దతుదారులు పారిపోయి దొడ్డిదారిన నా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నా కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నా తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి అనంతరం మా ప్రాంతానికి చెందిన 17-18 ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారని చెప్పారు. కాగా, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో రెండు రోజులపాటు మకాం వేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రానున్నారు. చదవండి: పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్, లేదంటే.. -
రసవత్తరం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి) పార్టీలో మొదలైన ముసలం టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది. మారనున్న సమీకరణాలు సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది. సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటు బెనర్జీ హాజరయ్యారు. -
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ తీర్మానం
కోల్‌కతా: పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధన 169 కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ బుధవారం వరకు ముగిసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీపీఎం, కాంగ్రెస్ ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలన్న అధికార పార్టీ డిమాండ్‌ను అవి వ్యతిరేకించాయి. ‘నల్లధనానికి మేం వ్యతిరేకమే. నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రణాళిక లేకుండా తీసుకున్నారు. దీంతో నగదు సరఫరా ఆగిపోయింది. దేశంలో మాంద్యం లాంటి వాతావరణం నెలకొంది. మోదీ నాయకత్వం వల్ల ఎప్పుడూ చూడని పరిస్థితులు తలెత్తాయి’ అని ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అన్నారు.