పెద్ద నోట్ల రద్దు ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కసారిగా స్తంభించిపోవటంతో రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. దీంతో ఉద్యోగుల వచ్చేనెల జీతాలకు కటకట తప్పదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తప్పనిసరైతే ఉద్యోగుల జీతాల్లో కొంత మేరకు కోత పెట్టాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది.