రైతులకు రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ: రైతుల కోసం రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో అవస్థల్లో ఉన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎంతో ఉపకరిస్తుందన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారంలోగా సబ్సిడీ నిధులు రైతులఖాతాల్లో జమ అవు తాయన్నారు. బ్యాం కర్లు సబ్సిడీ డబ్బులను రైతులకు అందజేయా లని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశారని, యాసంగి పంట సాగు కోసం ఇవి ఉపయోగపడతాయన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవ సాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై పరోక్షంగా పెట్టుబడి పెట్టామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏడా దికి రూ. 25 వేల కోట్లు విడుదల చేస్తున్నా మని తెలిపారు. ప్రతి నెల రెండు వేల కోట్ల పనులు ప్రాజెక్టులకు వెచ్చిస్తు న్నామన్నారు. 2018 జూన్ నాటికి కాళేశ్వరం నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు అందుతా యని, రెండు పంటలకు నీరందుతుందన్నారు. యాసంగికి 12.50 లక్షల మెట్రిక్ టన్నుల వరివిత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.