ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా | in yhis year 5% developing gdp-nomura | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా

Published Mon, Feb 24 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా

ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా

 ముంబై: ఈ ఆర్థిక సంవత్సర ం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) అనూహ్య వృద్ధిని సాధించే అవకాశాల్లేవని జపనీస్ బ్రోకింగ్ దిగ్గజం నోమురా అంచనా వేసింది.

 

ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న క ఠిన పరపతి విధానాలు, మందగమన పరిస్థితులు వంటివి కారణంగా నిలుస్తాయని నివేదికలో నోమురా పేర్కొంది. వెరసి ఈ ఏడాది జీడీపీ 4.5-5% స్థాయిలో నమోదు కావచ్చునని అభిప్రాయపడింది. అయితే 2014లో ఆర్థిక స్థిరీకరణకు అవకాశమున్నదని, పెట్టుబడుల వాతావరణం చక్కబడేందుకు ఆస్కారమున్నదని వివరించింది. అయితే ప్రస్తుతం అనూహ్య పురోభివృద్ధి సాధించేందుకు సరైన కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించింది.
 

 

ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ 4.4%(ఏప్రిల్-జూన్), 4.8%(జూలై-సెప్టెంబర్) చొప్పున పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన ఏడాది(2012-13) జీడీపీ 4.5%కు పరిమితమైంది. ప్రధానంగా అధిక వడ్డీ రేట్లు, డిమాండ్ పడిపోవడం వంటి దేశీయ అంశాలు ఇందుకు ప్రభావం చూపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement