
కౌమారదశ
కౌమారదశ అనేది మానవ అభివృద్ధిలో ప్రత్యేకమైన, క్లిష్టమైన దశ. మంచి ఆరోగ్యానికి దీర్ఘకాలిక పునాదులు వేయడానికి కీలకమైన దశ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘ఫ్యూచర్ సమ్మిట్’లో ‘ట్రెండ్స్ ఇన్ అడల్‌సెంట్ హెల్త్: సక్సెస్ అండ్ చాలెంజెస్ ఫ్రమ్ 2010 టు ది ప్రజెంట్’ పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కౌమరుల ఆరోగ్యం, అలవాట్లౖను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నివేదిక ఇది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... కౌమారదశలో ఉన్న ఏడుమందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాథపడుతున్నారు. నిరాశ, ఆందోళన అనేవి వారిలో తీవ్రంగా కనిపిస్తున్నాయి.
కౌమార బాలికలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. కౌమారదశలో ఉన్న పదిమందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. యువతలో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు పెరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలు యువత శారీరక, మానసిక ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది. కౌమారుల ఆరోగ్యం, హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని, పరిశోధన, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని అధ్యయన కర్తలు కోరుతున్నారు. యువత ఏం కోరుకుంటున్నారో నాయకులు వినాలని, వారు క్రియాశీల భాగస్వాములుగా, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండేలా చూడాలన్నారు.
ఇవి చదవండి: Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!