
స్కోడా ఆటో ఇండియా
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతోంది. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను పెంచడంతో అన్ని మోడళ్ల ధరలను 1 శాతం వరకూ (రూ.10,000 నుంచి రూ.35 వేల వరకూ) పెంచుతున్నామని తెలిపింది. దశల వారీగా కార్ల ధరలను మరింతగా పెంచుతామని పేర్కొంది.
మోడళ్లను బట్టి భవిష్యత్తులో ధరల పెంపు 3 నుంచి 4 శాతం రేంజ్‌లో ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ రూ.8.32 లక్షల ఖరీదు చేసే మిడ్ సైజ్ సెడాన్ రాపిడ్ నుంచి రూ.34.5 లక్షలు ధర ఉండే ఎస్‌యూవీ కోడియాక్ వరకు మోడళ్లను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment