సాక్షి, హైదరాబాద్: తూర్పు హైదరాబాద్‌లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాసిత ప్రాంతం ఇబ్రహీంపట్నం. ఐటీ, ఏరోస్పేస్ హబ్‌గా పేరొందిన ఆదిభట్ల, ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రమైన కొంగరకలాన్ ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఉండటంతో ఇబ్రహీంపట్నానికి డిమాండ్ పెరిగింది. అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలే కాకుండా వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అందుబాటు ధరలు ఇబ్రహీంపట్నం అభివృద్ధి చోదకాలు.
స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల స్వరూపం మారిపోయింది. సొంతంగా ఉండేందుకు విస్తీర్ణమైన ఇళ్లు కొనుగోలు చేశాక.. రెండో పెట్టుబడి వాణిజ్య సముదాయంలోనే చేయాలనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో ఇన్నాళ్లు ప్రధాన నగరంలోనే కేంద్రీకృతమైన గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రరాపార్టీలు.. క్రమంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించాయి. ప్రధానంగా హైదరాబాద్‌కు అనుసంధానమై ఉన్న ఇబ్రహీంపట్నంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు డిమాండ్ ఏర్పడిందని టీఎన్‌ఆర్ గ్రూప్ ఎండీ టీ నర్సింహారావు తెలిపారు.
(ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!)
ఇప్పటివరకు షాపింగ్ మాల్స్‌లలో రిటైల్ స్థలం కొనాలంటే పెద్ద ప్రహసనమే. ధర, డిమాండ్, అగ్రిమెంట్, నిర్మాణం వంటి చాలా అంశాలలో పరిజ్ఞానం ఉండాలి. దీంతో విద్యావంతులైన పెట్టుబడిదారులే ఈ తరహా ప్రాపర్టీలను ఎంచుకునేవారు. సామాన్య, మధ్యతరగతి కూడా గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టే విధంగా అత్యంత సులువు చేస్తున్నాయి పలు నిర్మాణ సంస్థలు. నిర్మాణ రంగంలో అనుభవం, నమ్మకమైన నిర్మాణ సంస్థ చేపట్టే వాణిజ్య సముదాయాలైతే ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు.
ఓటీటీ, యాప్‌లు వచ్చాక ప్రధాన నగరంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే ఈ సంస్కృతి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఇంకా రాలేదు. ఇలాంటి తరుణంలో ఇబ్రహీంపట్నంలో మల్టీప్లెక్స్ కం షాపింగ్ మాల్స్‌కు నిర్మించాలని నిరయించామని టీఎన్‌ఆర్ గ్రూప్ డైరెక్టర్ టీ విక్రమ్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం, కర్మన్‌ఫట్‌లలో 8 లక్షల చ.అ.లలో రెండు షాపింగ్ వల్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.
(ఇదీ చదవండి: మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా? కంపెనీ ఏం చెబుతోందంటే?)
ఇబ్రహీంపట్నంలో రెండ్నునర ఎకరాల విస్తీరంలో టీఎన్‌ఆర్ జగదాంబ, కర్మన్‌ఫట్‌లో మూడున్నర ఎకరాలలో టీఎన్‌ఆర్ ప్రిస్టన్ వల్‌ను నిరి్మస్తున్నాం. జగదాంబలో ఏడు స్క్రీన్లు, ప్రిస్టన్‌లో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. దీంతో పాటు ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్‌లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ దుకాణాలుంటాయి. జగదాంబ షాపింగ్ మాల్‌లో రెంటల్ ఇన్‌కం స్కీమ్‌ను ప్రారంభించాం. 100 చ.అ. రిటైల్ స్పేస్‌ను రూ.12 లక్షలకు అందిస్తున్నాం. దీంతో కొనుగోలుదారులకు నెలకు రూ.6 వేలు అద్దె కంపెనీ చెల్లిస్తుంది. ఇరవై ఏళ్ల గ్యారంటీ లీజు ఉంటుంది.
విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, సపర్ వర్కెట్లు, బ్యాంకులు, వంటి అన్ని రకాల వ్యాపార సముదాయాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్ల ధరలు రూ. 40 లక్షల నుంచి ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఇబ్రహీంపట్నం మీదుగా భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీకి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వంతో తుది దశ చర్చలు ముగిశాయి కూడా. కొంగరకాన్ - రావిర్యాలలో ఎల్రక్టానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment