న్యూఢిల్లీ: అమెరికా ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో మరిన్న పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉంది. భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు, తద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నామని ఆ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీతో టెక్ దిగ్గజాల సమావేశం అనంతరం బెజోస్ ఈ విషయాన్ని ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, వచ్చే నెల నుంచి అమలు కానున్న జీఎస్‌టీ విధానంతో వ్యాపారం మరింత సులభతరమవుతుందని ప్రధాని ఆయనకు వివరించారు. ఈ భేటీ జరిగిన తరువాత అమెజాన్ సీఈవో ట్విటర్ ద్వారా భారత్‌లో తమ సంస్థ పెట్టుబడుల విషయాన్ని వెల్లడించారు. 20 అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వీరిలో అమెజాన్ సీఈవో బెజోస్, ఆపిల్ సిఈఓ టిమ్ కుక్, గూగుల్ సుందర్ పిచాయ్, సిస్కో నుంచి జాన్ చాంబర్స్, శాంతాను నారాయణ్ అడోబ్ నుంచి, మాస్టర్ కార్డ్ నుంచి అజయ్ భట్నాగర్ తదితరులు ఉన్నారు.
కాగా ఇటీవల భారతదేశంలో నాలుగు సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న అమెజాన్, ఇంటిగ్రేటెడ్ ఇ-రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ తో నాయకత్వం కోసం తీవ్ర పోరాడుతోంది. 13 రాష్ట్రాల్లో 41 గిడ్డంగులను కలిగి ఉంది. 2013లో 100 మంది అమ్మకందారులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 2లక్షల మందికి చేరుకున్నసంగతి తెలిసిందే.