Razor blade
-
వెర్టైస్ రూ.100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేవింగ్ బ్లేడ్స్, రేజర్స్, క్రీమ్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ వెర్టైస్ గ్లోబల్ వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. తద్వారా మరో 400–500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ డైరెక్టర్ సాయితేజ బొడ్డుపల్లి తెలిపారు. 30 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే రూ.40 కోట్లు వెచ్చించింది. 200 మంది ఉద్యోగులు ఉన్నారని మరో డైరెక్టర్ పురుషోత్తం పబ్బ చెప్పారు. -
లవర్‌పై యువకుడి బ్లేడుతో దాడి
క్రిష్ణగిరి: విబేధాల కారణంగా యువతిపై దాడి చేసిన వ్యక్తిని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు సమీపంలోని బేరికె అన్నానగర్‌కు చెందిన లావణ్య (19), అదే ప్రాంతానికి చెందిన బంధువు శివకుమార్ (29) మధ్య విభేదాలు ఉన్నా యి. బుధవారం శివకుమార్ లావణ్యపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. -
బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు
సాక్షి, మణికొండ: గేమ్స్ ఆడుకునేందుకు ఫోన్ ఇవ్వాలని కుమారుడు విసిగిస్తుండటంతో భయపెట్టడానికి తల్లి కుమారుడి కాళ్లను బ్లేడ్‌తో చిన్నగా కోసింది. అయితే తానే కోసుకుంటానంటూ ఆ బాలుడు బ్లేడుతో గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంధంగూడ జేఎన్‌ఎన్‌ఆర్‌ఎంయూ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గంధంగూడలో ఉంటున్న చంద్రకళ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఏడో తరగతి చదువుతున్న ఆమె కుమారుడు శంకర్(12).. సోమవారం రాత్రి ఫోన్ ఇవ్వాలని గొడవచేయసాగాడు. విసిగివేసారిన ఆమె భయపెట్టాలని భావించి బ్లేడ్‌తో కాలిపై చిన్నగా కోసింది. అయితే, తానే కోసుకుంటానని అదే బ్లేడ్ తీసుకుని పలుమార్లు శంకర్ కోసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా తన తల్లి ఫోన్ ఇవ్వనందుకు తానే బ్లేడుతో కోసుకున్నానని శంకర్ పోలీసులకు రాతపూర్వకంగా తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గంగాధర్ తెలిపారు. -
'ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపించాం'
సాక్షి, చెన్నై: గృహ నిర్బంధంలో పెరిగిన గడ్డంతో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపినట్లు తమిళనాడులోని బీజేపీ శ్రేణులు ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు నాటి నుంచి గృహనిర్బంధంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫొటో ఇటీవల ఇంటర్నెట్ ద్వారా బయటకు వచ్చింది. గతంలో ఎప్పుడూ శుభ్రంగా షేవింగ్ చేసుకునే ఒమర్ అబ్దుల్లా ఆ ఫొటోలో దట్టంగా గడ్డం పెరిగిన స్థితిలో వృద్ధునిలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఈ ఫొటోను మాధ్యమాల్లో పెట్టినట్లు సమాచారం. అంతేగాక పలుపార్టీల నేతలు ఉమర్ అబ్దుల్లాకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ నేతలు ఉమర్ అబ్దుల్లా ఫొటోను హేళన చేశారు. ఉమర్ అబ్దుల్లాతో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలంతా స్వేచ్ఛగా తిరుగుతుండగా ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతేగాక అమేజాన్ ద్వారా షేవింగ్ రేజర్‌ను జమ్ముకశ్మీర్‌లోని ఉమర్ అబ్దుల్లా విలాసానికి బుక్ చేశారు. దయచేసి దీనిని స్వీకరించండి, ఏదైనా అవసరమైతే మీ కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోండని ట్వీట్ చేశారు. (ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్) -
ఒకరికి వాడిన రేజర్‌నే మరో రోగికి వాడుతున్నారు
గుంటూరు మెడికల్: రోగంతో బాధపడుతూ రాజధాని ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేద రోగులకు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకంతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం మెండుగా ఉంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి వైరస్లు సోకే ప్రమాదం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆపరేషన్ చేయాల్సిన రోగులకు ఆ పరేషన్ ముందు తప్పనిసరిగా వెంట్రుకలను క్షురకులు తొలగిస్తారు. తల లేదా ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలై కుట్టు వేయాల్సిన సమయాల్లో సైతం వెంట్రుకలను తొలగించిన పిదప మాత్రమే కుట్లు వేస్తారు. అయితే బార్బర్లకు బ్లేడ్లు, రేజర్లు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవడం లేదు. క్షురకులు తమకు నెలకు వస్తున్న ఆరువేల జీతంలోనే కొంత మొత్తం బ్లేడ్లు, రేజర్ల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. రోగులు కొనుగోలు చేయని పక్షంలో ఒకరికి వినియోగించిన రేజర్‌తోనే మరో రోగికి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒకరి నుంచి మరొకరికి రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ కొత్త రేజర్ కొనుగోలు చేయలేకపోతున్నామని అందువల్లే బ్లేడ్‌ను మార్చి అదే రేజర్‌తో షేవింగ్ చేస్తున్నట్టు క్షురకులు వెల్లడించారు. చాలీచాలని వేతనాలు... జీజీహెచ్‌లో ప్రస్తుతం రెండు క్షురకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2010లో ఒకరు పదవీ విరమణ చేయగా, 2015లో మరో వ్యక్తి చనిపోవటంతో రెండు రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. అవుట్‌సోర్సింగ్‌లో 2010 నుంచి ఒకరు, 2015 నుంచి ఇద్దరు చొప్పున, ప్రస్తుతం ముగ్గురు క్షురకులు మూడు పూటలా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఒక్కరే క్షురకుడు ఉండటంతో పలుమార్లు రాత్రి వేళల్లో క్షురకులు లేక నాల్గోతరగతి వైద్య సిబ్బంది షేవింగ్ చేసేందుకు అవస్థలు పడేవారు. అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న క్షురకులకు ఒక్కొక్కరికి నెలకు ఆరువేల వేతనం ఇస్తున్నారని, ఆరువేలతో తమ కుటుంబం గడవడం లేదని వాపోతున్నారు. క్షురకులు వేచి ఉండేందుకు ఎలాంటి గదులు లేకపోవటంతో రాత్రి వేళ విధులకు చాలా ఇబ్బందిగా ఉంటున్నట్లు తెలిపారు. బ్లేడ్లు, రేజర్లు కొత్తవి కొనుగోలు చేసి ఇవ్వటంతో పాటుగా తమకు వేతనాలు పెంచేలా ఉన్నతాధికారులు చూడాలని వారు కోరుతున్నారు. నా దృష్టికి రాలేదు బ్లేడ్లు, రేజర్ల సమస్య ఉన్నట్టు నా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. క్షురకులు, రోగులు వాటిని కొనుగోలు చేసే పనిలేకుండా ఆస్పత్రి నుంచి కొనుగోలు చేసి అందజేసి ఇన్ఫెక్షన్లు సోకకుండా చర్యలు తీసుకుంటాం. క్షురకుల పోస్టులతో పాటుగా నాల్గోతరగతి పోస్టులను ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా త్వరలోనే రిక్రూట్ చేయనుంది. వారు కనీస వేతనాలు ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటారు.–డాక్టర్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
గడ్డం... కాదు అడ్డం!
పురుషజాతికి ప్రథమ శత్రువు రేజర్ బ్లేడ్. దానినే కనక కనిపెట్టకపోయి ఉంటే మగవాళ్లందరూ ఎంచక్కా మంచి మంచి గడ్డాలతో కళకళలాడుతూ ఉండేవాళ్లు అంటారు గడ్డం ప్రేమికులైన మగవాళ్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొన్ని నెలల క్రితం ‘గడ్డాల మీసాల పోటీ’ జరిగింది బెంగళూరులో. 400 మంది బవిరి గడ్డాల వాళ్లు, కురచ గడ్డాల వాళ్లు, బారు గడ్డాల వాళ్లు, చిట్టి పొట్టి గడ్డాల వాళ్లు పాల్గొన్నారు. వీళ్లలో మీసగాళ్లు కూడా ఉన్నారు. ‘నవంబర్ నెలను నో షేవ్ మంత్‌గా పాటించే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ నెలలో గడ్డాలు గీసుకోకుండా మగవారి ఆరోగ్య సమస్యల పట్ల చైతన్యం కలిగించడమే దీని ఉద్దేశం’ అని నిర్వాహకులు అన్నారు. ‘గడ్డంతో ఇబ్బంది లేదా’ అని అడిగితే, ‘లేదు ఇలాగే బాగుంది’ అని చాలామంది జవాబు చెప్పారు. కొందరు మాత్రం ‘బాగుంది కానీ అన్నం తినేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది’ అని నవ్వేశారు. సంపద అంటే పెద్దనోట్లు చిన్ననోట్లు మాత్రమే కాదు... కేశ సంపద ఉండడం కూడా పెద్ద సంపదే అని ఈ గడ్డం రాయుళ్లని చూస్తే అర్థమయ్యింది.