అర్జున్‌ రెడ్డి స్టైల్లో కేటీఆర్‌.. అదిరిన కొత్త లుక్.. | KTR With Beard And Mustache Using AI Technology Goes Viral | Sakshi
Sakshi News home page

అర్జున్‌ రెడ్డి స్టైల్లో కేటీఆర్‌.. అదిరిన కొత్త లుక్..

Published Mon, Jan 22 2024 3:54 PM | Last Updated on Mon, Jan 22 2024 4:19 PM

KTR With Beard And Mustache With AI Technology Goes Viral - Sakshi

కేటీఆర్‌ ఎప్పుడూ నీట్ షేవ్‌తో డీసెంట్‌ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టయిల్‌ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. మరి అలాంటి లీడర్‌ అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. క్లాస్‌ లుక్‌ నుంచి మాస్‌ లుక్‌కు మారిన కేటీఆర్‌ చిత్రాన్ని చూస్తారా?

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వాడకం ఎక్కువ అవ్వడంతో ప్రతి రంగంలోనూ మార్పులు జరుగుతున్నాయి. ఏఐసాయంతో ఇష్టమైన నాయకుల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్‌తో పరిచయం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్‌ అభిమాని.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫోటను ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్‌లో రూపొందించారు.  పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్‌ చేసి కేటీఆర్‌కు పంపించాడు.

ఆ ఫొటో కేటీఆర్‌కు బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్‌లో (ట్విటర్‌)షేర్‌ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా’ అనే క్యాప్షన్‌ ఇస్తూ కేటీఆర్‌ ఆ ఫొటోను షేర్‌ చేశారు. దాని కింద ‘నేను నా జుట్టు, గడ్డం పెంచుకుంటే’ అని ఓ ట్యాగ్‌లైన్‌ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: రేవంత్ రెడ్డి ఫోకస్‌ మారితేనే మంచిది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement