సాక్షి, వెబ్‌డెస్క్: మగవారి అందాన్ని గడ్డం రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ముఖ్యంగా యువత వైవిధ్యమైన ఆకృతుల్లో గడ్డం పెంచి కొత్త ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. కాస్త కొత్తగా కనిపించాలంటే.. గడ్డంలో మార్పు చేస్తే చాలని హెయిర్ స్టైల్ నిపుణులు కూడా సూచనలు ఇస్తారు. అయితే చాలా మంది గుబురుగా గడ్డం పెంచుకొని ఆకర్షణీయంగా కనిపించాలని ఆశపడాతారు. కానీ, తల మీద జట్టు ఉన్నంత ఒత్తుగా గడ్డం రాదు.
అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ రోజు ‘ప్రపంచ గడ్డం దినోత్సవం’. చాలా మంది మంచి గడ్డం పెంచుకొని తమ స్నేహితుల ‘గడ్డం గ్యాంగ్’ లో కలవాలని తహతహలాడుతారు. మంచి గడ్డంతో ట్రెండీగా ఉన్న కొంత మందికి తల జట్టు వలే.. గడ్డం కూడా పలుచబడుతుంది. అలాంటి వారి కోసమే.. గడ్డాన్ని రక్షించుకునే పది చిట్కాలు..
► షేవింగ్ నిలుపుగా చేయించాలి..
సాధారణంగా గడ్డంను షేవింగ్ చేసుకునే సమయంలో ముఖంపై నుంచి కిందికి, కింది నుంచి పైకి రేజర్‌తో షేవ్ చేస్తారు. అయితే దానికి బదులుగా అడ్డంగా.. కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి షేవ్ చేసుకుంటే గడ్డం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది.
► ఆముదం నూనె..
గడ్డం పెరగడానికి ఖరిదైన క్రీమ్‌లు, నూనెలు వాడుతుంటారు కొంతమంది. అయితే వాటి బదులు సహజమైన ఆముదం నూనెతో ప్రతి రోజు రాత్రి ముఖానికి మర్ధనం చేసుకుంటే గడ్డం దట్టంగా పెరుగుతుంది.
► ఆలివ్ ఆయిల్..
ముఖానికి ఆలివ్ ఆయిల్ మర్ధనం చేయడం వల్ల గడ్డం సంమృద్ధిగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్‌కు జట్టు పెంచే సామర్థ్యం ఉన్నట్లు ఆయుర్వేదం కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.
► సరైన ఆహారం..
సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల జట్టుతో పాటు గడ్డం కూడా పలచబడతూ ఉంటుంది. అయితే గడ్డం బాగా పెరగాలంటే.. కాలీఫ్లవర్, బీన్స్, అరటిపండ్లు, సోయాబీన్, గుడ్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ కూరగాయాలను ఆహారంలో భాగం చేసుకుంటే గడ్డం పెరుగుదల సంమృద్ధిగా ఉంటుంది.
► కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె జట్టును సంరక్షించడంతో పాటు గడ్డం పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే కొబ్బరి నూనెతో పాటు రోజ్మేరీ ఆయిల్‌ను తగిన పాళ్లలో కలిపి మర్ధనం చేసుకోవటం వల్ల గడ్డం పెరుగుదలకు మేలు చేస్తుంది.
► ఫేషియల్ మసాజ్..
ముఖంపై గడ్డం పెరగాలంటే ప్రతి రోజు ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవటం వల్ల రక్త సరఫరా మెరుగువుతుంది. దాని వల్ల జట్టు కుదుళ్లకు పోషకాలను రవాణా బాగా జరుగుతుంది. దాంతో గడ్డం వేగంగా, దట్టంగా పెరుగుతుంది.
► పొగతాగటం మానేయాలి..
పొగతాగటం వల్ల జట్టు పెరగటం తగ్గిపోతుంది. సిగరేట్లలో ఉండే నికోటిన్ రక్త సరఫరా వేగాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రభావం జట్టు, గడ్డం పెరగటంపై పడుతుంది.
► ఒత్తిడి దూరంగా ఉండాలి..
ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల కూడా జట్టు ఎదుగుదల మందగిస్తుంది. ముఖంపై ఉండే గడ్డం పెరుగుదలలో దాని ప్రభావం కనిపిస్తుంది. ఒత్తిడి వల్ల విడదలయ్యే కొన్ని హార్మొన్లు గడ్డం ఎదుగుదలను అడ్టుకుంటాయి.
► మంచి నిద్ర
కచ్చితంగా శరీరానికి కావల్సినంత సమయం నిద్ర పోవాలి. తగినంత నిద్ర పోవటం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు సరైన క్రమంలో ఉంటాయి. మంచి నిద్రతో జట్టు రాలిపోకుండా గడ్డం దట్టంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment