Guinness World Record: Man Lifting 63 Kgs Woman Using Beard Video Goes Viral - Sakshi
Sakshi News home page

Guinness World Record: ఎంత బిగుతైన గడ్డామో! 63 కేజీల యువతిని ఎత్తాడు..!!

Published Tue, Nov 23 2021 4:01 PM | Last Updated on Tue, Nov 23 2021 6:37 PM

Guinness World Record Man Lifting 63 Kg Woman Using Beard Video Goes Viral - Sakshi

Guinness World Record Man Lifting 63 kg Woman Using Beard: గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు 63 కేజీల మహిళలను పైకి ఎత్తుతాడు. ఆ.. ఇలాంటివి చాలానే చూశాం.. అనుకుంటున్నారా! అతను ఎత్తింతి చేతులతో కాదు.. అదే ట్విస్ట్‌!!

ఈ వీడియోలో స్టంట్‌ చేసిన వ్యక్తి పేరు అంటనాస్ కాంట్రిమాస్. అతని గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా లేపడం కనిపిస్తుంది. మహిళను పైకి ఎత్తేటప్పుడు అతని ముఖంలో బాధ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐతే ఆ బాధంతా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికే భరించానని అంటున్నాడు ఈ గెడ్డం వీరుడు. దీంతో గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటివ్యక్తిగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.

సోషల్‌ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో కామెంట్లతో వైరల్‌ అవుతోంది. ఇది నిజంగా చాలా అద్భుతం, భిన్నమైన ప్రతిభ అని ఒకరు, ఇతని వెంట్రుకలు దేనితో తయారు చేయబడ్డాయో.. ఇంత స్రాంగ్‌గా ఉన్నాయని మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు. ఏదిఏమైనప్పటికీ ఇతని గడ్డం గురించి నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి.

చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement